32.2 C
Hyderabad
May 19, 2024 18: 21 PM
Slider తూర్పుగోదావరి

పురోహితుడి ఇంట్లో రూ 12 లక్షలు విలువైన నగలు అపహరణ

#theft

తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం లోని తాపేశ్వరం గ్రామంలోని ఒక ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి భారీ దోపిడికి పాల్పడ్డారు. బంగారం,  వెండి  అపహరించుకుపోయారు. రూరల్ ఎస్ ఐ బళ్ల శివ కృష్ణ కథనం మేరకు తాపేశ్వరం లో పుల్లకవి భాస్కరరావు పౌరోహిత్యం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఆయన భార్యకు అనారోగ్యంగా ఉండటంతో రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. గత సంవత్సరం డిసెంబర్ 29వ తేదీన వైద్యులు ఆమెను ఆస్పత్రిలో ఉంచాలని సూచించడంతో అక్కడే ఉండిపోయారు. ఇంటిని ఆయన శిష్యుడైన బొగ్గవరపు సూరిబాబు  అప్పగించగా అతడు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఇంటిని చూస్తూ ఉండేవాడు.

రోజువారి ఈ క్రమంలో భాగంగా శనివారం ఉదయం ఇంటికి వచ్చిచూడగా ఇంటి తాళం బద్దలకొట్టి తలుపులు ఉడదీసి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న రామచంద్రపురం డిఎస్పి బాలచంద్రారెడ్డి, రూరల్ సిఐ పెద్దిరెడ్డి శివ గణేష్, ఎస్ఐ బళ్ల శివ కృష్ణలు సంఘటన జరిగిన తీరును పరిశీలించారు.

గుర్తుతెలియని వ్యక్తులు రూ.11 లక్షల 70 వేల విలువైన బంగారం , రూ.77000 వేల రూపాయల విలువైన వెండి ని దోచుకు పోయారు. పూజారి కుమారుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై శివ కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా పోలీసులు క్లూస్ టిమ్ ను రంగంలోకి దింపారు.

కాగా తాపేశ్వరం శివలాయం వీధి లో చోరీ జరిగిన ఇంటి సమీపంలో శనివారం తెల్లవారుజామున కొందరు దుండగులు మరో ఇంటి లోకి ప్రవేశించారు. అక్కడ అలికిడి కి గృహస్తులు మేల్కొని లైట్ లు వేశారు. దీంతో అక్కడి నుండి పరారైన దుండగులు పక్కనే ఉన్న పూజారి ఇంట్లో కన్నం వేశారు.

గత కొన్ని రోజులుగా తాళం వేసి ఉండటాన్ని గమనించిన దుండగులు రెక్కీ నిర్వహించి పకడ్బందీగా దోపిడీ కి పాల్పడ్డట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇదే తరహా లో మండపేట టౌన్ లోని రెడ్డి వారి వీధిలో ఓ ఇంట్లో రూ 26 లక్షలు నగదు దోపిడీ కాగా సుమారు ఐదు నెలల అయినప్పటికీ ఆ కేసు చేధించడం లో పోలీసులు విఫలమయ్యారు.

Related posts

శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో రాజకీయం తగదు

Satyam NEWS

తీర్పుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

Satyam NEWS

క‌ల‌క‌లం సృష్టిస్తున్న యువ‌తి మృత‌దేహం…!

Satyam NEWS

Leave a Comment