29.2 C
Hyderabad
May 18, 2024 11: 34 AM
Slider విజయనగరం

స్పందన లో 23 మంది బాధితుల స‌మ‌స్య‌లు విన్న విజయనగరం పోలీస్ బాస్

#vijayanagaramsp

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ దీపిక  నిర్వహించారు. సామాన్య ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడారు.

త‌క్ష‌ణం వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని కింది స్థాయి సిబ్బందిని ఆదేశించారు. ఈ “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ  23 మంది బాధితుల స‌మ‌స్య‌ల‌ను  విన్నారు.

విజయనగరం, గాజులరేగకు  చెందిన ఓ బాధితురాలు జిల్లా ఎస్పీకి  ఫిర్యాదుచేస్తూ తనకు 4 ఏళ్ల క్రితం వివాహం జరిగిందని, తన భర్త అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నట్లు, అతని కుటుంబ సభ్యులు తన భర్తకు రెండో  వివాహం చేయడానికి ప్రయత్నిన్నార‌ని… తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాది పై స్పందించిన జిల్లా ఎస్పీ రెస్పాండెంట్ ను పిలిచి కౌన్సిలింగ్ ఇప్పించి, విచారణ చేపట్టి చట్టపరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం దిశ పిఎస్ డిఎస్పీని అదేశించారు.

రామబద్రపురం మండలం, పాతరేగకు  చెందిన ఓ బాధితుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ ఒక వ్యక్తి కి వడ్డీకి కొంత డబ్బులు అప్పుగా ఇచ్చినట్లు, సదరు వ్యక్తి తన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని, తన డబ్బులు తనకు తిరిగి ఇప్పించి తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాది పై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ జరిపి ఫిర్యాదికి న్యాయం చేయాలని రామబద్రపురం ఎస్ఈని ఆదేశించారు.

నా స్థలాన్ని కబ్జా చేస్తున్నారు కాపాడండి

కొత్తవలస మండలం, గొల్లల పేటకి  చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తను తన గ్రామంలో 2005లో కొంత భూమిని కొనుగోలు చేసుకున్నాన‌ని కానీ అప్పటినుండి తన స్వాధీనంలో ఉన్నట్లు ఈ నె ల 15 వ తేదీన‌ అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తన స్థలంలో సిమెంటు పోల్సును వేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నార‌ని…, తనకి న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ జరిపి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని కొత్తవలస సీఐని ఆదేశించారు.

దత్తిరాజేరు మండలం, కోమటిపల్లికి ఒకామె జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ తనకు ఏళ్ల క్రితం వివాహం జరిగిందని, తన భర్త, అత్త మామలు మరియు అతని బంధువులు తనని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని, తన పిల్లలను తన నుండి వేరుచేయడానికి చూస్తున్నట్లు తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని పెదమానాపురం ఎస్ఐని ఆదేశించారు.

బొబ్బిలి మండలం, గున్నతోటవలసకి చెందిన ఓ బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ అదే మండలానికి చెందిన ఒక వ్యక్తి తన వద్దనుండి కొంత డబ్బులు, బంగారు ఆభరణాలు తిరిగి ఇచ్చివేస్తానని చెప్పి తీసుకొని, తిరిగి ఇవ్వమని అడిగితే ఇవ్వను అని చెప్పి బెదిరిస్తున్నార‌ని…, తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని బొబ్బిలి సీఐని ఆదేశించారు. ఇలా ఒక్కో బాదితుల నుంచీ ఫిర్యాదుల‌ను  స్వీక‌రించిన ఎస్పీ… తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో వారి వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదుల పై తీసుకున్న చర్యలను తనకు వెంటనే నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ  దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, ఎస్బీ సీఐ రుద్రశేఖర్, డీసీఆర్ బి ఎస్ఐలు మురళి, ముకుందరావు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

అమ్మవార్లను భక్తిశ్రద్ధలతో ఆరాదిస్తే అన్ని శుభాలే

Satyam NEWS

అగాధమంత బాధ నుంచి ఆకాశమంత ప్రేమ పుడితే?

Satyam NEWS

చిరు చినుకుల మధ్యనే విజయనగరం ఎస్ పి విధినిర్వహణ

Satyam NEWS

Leave a Comment