28.2 C
Hyderabad
April 30, 2025 05: 28 AM
Slider కృష్ణ

సుజనా చౌదరిని ఓడించేందుకు వంద కోట్లు ‘‘సిద్ధం’’?

#sujanachowdary

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా కూటమి తరపున పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నాయకుడు సుజనా చౌదరి పై భారీ కుట్రకు సీఎం జగన్ రెడ్డి సిద్ధం అయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుజనా చౌదరితో గతంలో ఉన్న రాజకీయ విభేదాల కారణంగా ఆయనను అసెంబ్లీకి రాకుండా నిలువరించేందుకు రూ. 100 కోట్లతో జగన్ సిద్ధం అయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా కూడా ఇది నిజం అని బీజేపీ నేతలు అంటున్నారు. సుజనా చౌదరిని ఎలాగైనా ఓడించాలని జగన్ ఎందుకు పంతం పట్టాడు అనేది ఆసక్తికరం గా కనిపిస్తున్నది.

వాస్తవాలు మాట్లాడుకోవాలంటే వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే వైఎస్సార్ ఆకస్మిక మరణంతో జగన్ సీఎం అయ్యే ప్రయత్నంలో పడి సుజనా చౌదరిపై కక్షను ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. 2012లో అవినీతి కేసుల్లో జగన్ ను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు వెనుక చంద్రబాబు, సుజనా ఉన్నారని జగన్ అనుమానం. అయితే ఆ తర్వాత సుజనా చౌదరి కేంద్రంలో మంత్రి కావడం వల్ల జగన్ ఏమీ చేయలేకపోయాడు. 2019లో జగన్ సీఎం అయిన నాటి నుంచి పాత కక్షలు మళ్లీ బయటకు తెచ్చాడు జగన్. అందులో భాగంగానే అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో సుజనా పేరు వచ్చింది.

అయితే ఇన్సైడర్ ట్రేడింగ్ కేసును ఏపీ హైకోర్టు కొట్టేసింది. అదే సమయంలో అమరావతి రైతుల న్యాయ పోరాటానికి సుజనా చౌదరి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఢిల్లీ నుంచి ప్రముఖ లాయర్లను తీసుకొచ్చి అమరావతి రైతుల కేసులను ఒక కొలిక్కి వచ్చేలా సుజనా చౌదరి చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. అందుకే… అమరావతిపై వెనక్కి తగ్గితే రాజ్యసభ సీటు ఇస్తానంటూ జగన్ ఆఫర్ చేశాడు. వైసీపీ ఆఫర్ కాదని సుజనా చౌదరి.. రాజధాని రైతులతోనే ఉన్నారు. దీంతో జగన్ కక్ష మరింత పెరిగింది….

ఇప్పుడు సుజనా చౌదరి విజయవాడ పశ్చిమంలో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు…. ఆయన గెలిచి అసెంబ్లీలో అడుగుపెడితే ఏం జరుగుతుందో జగన్ కు కచ్చితంగా తెలుసు. ఈ కారణంగానే జగన్ వంద కోట్లు వెదజల్లాలని నిర్ణయించుకున్నాడని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే…. సుజనా చౌదరి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు… ప్రజలు ఆయన వైపే ఉన్నారు.

Related posts

కార్మికులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి

Satyam NEWS

టిడబ్ల్యూజెఎఫ్ మేడ్చల్ జిల్లా కోశాధికారి అశోక్ కు సన్మానం

Satyam NEWS

శబరిమలలో దర్శనం ఇచ్చిన మకరజ్యోతి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!