28.2 C
Hyderabad
May 9, 2024 02: 39 AM
Slider చిత్తూరు

అవ్వ తాతల పింఛన్లతో ఆటలోద్దు

#Naveen Kumar Reddy

పింఛన్ల పంపిణీలో పొలిటికల్ “చీఫ్ ట్రిక్స్” ప్రయోగించకండి నవ్వుల పాలవుతారు…

ఏపీలో త్వరలో జరగబోవు ఎన్నికల నిబంధనలో భాగంగా ఎన్నికల సంఘం తాత్కాలికంగా మాత్రమే వాలంటీర్స్ ను పింఛన్ల పంపిణీకి దూరం పెట్టి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ విషయంలో పేద ప్రజల జీవితాలతో “దాగుడుమూతలు” ఆడటం అన్యాయమన్నారు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ తీరు “ఆడలేక మద్దెల ఓడు” అన్న చందంగా పింఛన్ల పంపిణీనీ ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని దుష్ప్రచారం,రాద్ధాంతం చేయడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.

గతంలో నగరపాలక సంస్థ మున్సిపాలిటీ పంచాయతీ సిబ్బంది ద్వారా అనేక సంవత్సరాల పాటు పట్టణాలలో గ్రామాలలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పుడు వాలంటీర్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తున్నదని కేవలం ఎన్నికలు పూర్తయ్యే వరకు పాత పద్ధతిలో త్వరితగతిన పింఛన్లు అందించేలా ఏపీ చీఫ్ సెక్రటరీ దృష్టి సారించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన అన్ని వర్గాల పేద ప్రజలందరికీ అందిస్తున్న పింఛన్ల పంపిణీ పై ఎన్నికల సంఘం ఆదేశాలను “బూచిగా” చూపి ఉద్దేశపూర్వకంగా రాజకీయ వ్యూహంలో భాగంగా సకాలంలో అర్హులకు పింఛన్లు అందకుండా ఆలస్యం చేసే “కుట్రను” రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలన్నారు.

భారతదేశంలో ఎన్నికలు జరిగే సందర్భంలో ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు జరపరాదని ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నతాధికారులు భాగస్వాములు కాకూడదని ఎన్నికల నిబంధనలు చెబుతున్నాయి అందులో భాగంగా పింఛన్ల పంపిణీ వాలంటీర్స్ ద్వారా తాత్కాలికంగా వద్దని ఎన్నికల సంఘం ఆదేశిస్తే దానిని రాజకీయం చేయడం దుర్మార్గమన్నారు. ఏపీ లోని గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సకాలంలో ఇంటి వద్దకే వెళ్లి అవ్వ తాతలకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్లు అందించే బాధ్యతను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు తీసుకునేలా ఏపీ చీఫ్ సెక్రటరీ కి ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వాలన్నారు.

ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలపై నింద మోపేందుకు పడరాని పాట్లు పడుతున్నారని రాష్ట్రంలోని పింఛన్ దారులు అన్నీ గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం “బటన్ నొక్కి” ఇస్తున్న సంక్షేమ పథకాలు,పింఛన్లు అన్నీ కూడా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వానికి కట్టే ఆస్తిపన్ను, వివిధ పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే అన్న విషయాన్ని అధికార పార్టీ నాయకులు గుర్తించాలన్నారు.

రాష్ట్రంలో “రెక్కాడితే కానీ డొక్కాడని” పేద మధ్యతరగతి కుటుంబాలకు వికలాంగులకు,వితంతువులకు పింఛన్లే ఆధారమని అవ్వ తాతలు షుగరు బీపీ దీర్ఘకాలిక జబ్బులతో వ్యాధులతో బాధపడుతూ మందుల కొనుగోళ్ల కోసం నెల మొదటి వారం కోసం ఎదురుచూస్తుంటారన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం “రాజకీయ ప్రయోజనం కోసం కాకుండా మానవతా దృక్పథంతో” ఆలోచించి ప్రభుత్వ సిబ్బందిచే వెంటనే పింఛన్లు అందించాలన్నారు.

Related posts

పోలీసు త్యాగాల వలనే సమాజంలో స్వేచ్ఛగా జీవిస్తున్నాం

Satyam NEWS

ఇంటి వద్ద ఐఐటీ, నీట్ శిక్షణ, అధ్యాపకుల సమాచారం

Satyam NEWS

దీపావళి సందర్భంగా పితృదేవతలకు ప్రత్యేక పూజలు

Satyam NEWS

Leave a Comment