25.7 C
Hyderabad
May 19, 2024 07: 32 AM
Slider ప్రత్యేకం

మధ్యతరగతి సొంత ఇంటి కల కొల్లగొడుతున్న మంత్రి అనుయాయులు

#vijayanagaram

రాజు త‌ల‌చుకుంటే  దెబ్బ‌ల‌కు కొద‌వా అన్న‌ట్టు…అమాత్యులు..అదే మంత్రి త‌ల‌చ‌కుంటే…ఏ శాఖ అధికారులైన నందిని పంది…పందిని నందిగా మార్చ‌గ‌ల స‌త్తా…కేవ‌లం ఒకేఒక్క రెవిన్యూ శాఖకే ఉంద‌ని చెప్ప‌డానికి..మీరు చ‌ద‌వ‌బోయే వార్తే అందుకు నిద‌ర్శ‌నం..అప్పుడెప్పుడో  అంటే ర‌మార‌మి 1982లో ఇచ్చిన  భూమి ఆధారంగా కొంద‌రు ల‌బ్దిదారులు…విజ‌య‌న‌గ‌రం తోట‌పాలెం లో  కొంత స్థ‌లం కొనుక్కున్నారు.

అందులో ఆర్టీసీ ఉద్యోగులు…అలాగే  టీచ‌ర్లు…ఇత‌ర ఉద్యోగుస్తులు…వారితో పాటు పొరుగున ఉన్న కొంద‌రు క‌లిసి..మూక‌మ్ముడిగా..స‌త్య‌సాయి లేవుట్ పేరుతో స్థ‌లం రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌డంతో.. ఇక ఇండ్లు నిర్మించుకోవ‌డ‌మే ఆల‌స్యం..అంత‌లోనే  స్థానిక మంత్రి అనూయాయులు ప్ర‌వేశించి…ఈ స్థలాన్ని..పూస‌సాటి వంశీయుల వాళ్లు త‌మ‌కు అమ్మేసారంటూ…స‌త్య సాయి లేవుట్   ప్లాట్ ఓన‌ర్ల ఇంటి నిర్మాణాల‌ను అడ్డుకోవ‌డ‌మే కాక‌..కోర్టుకు ఎక్కారు.

దీంతో స‌త్యసాయి లే అవుట్ ప్లాట్ య‌జ‌మానులంతా కోర్టు వెళ్లి..స్థ‌ల ఆధారాలు చూపించి..ఇంజక్ష‌న్ ఆర్డ‌ర్  తెచ్చుకున్నారు. హ‌మ్మ‌య్య  ఇక ఇండ్లు క‌ట్టుకోవ‌డ‌మే త‌రువాయి  అన్న సంద‌ర్బంలో ఏకంగా స్తానిక మంత్రే త‌ల‌దూర్చిన‌ట్టు స‌మాచారం.ఇదే విష‌యం ప్ర‌స్తావిస్తూ…స‌త్య‌సాయి లేవుట్ స‌భ్యులు… స్పంద‌న కార్య‌క్రమానికి వ‌చ్చిన లిఖిత పూర్వ‌కంగా..  ఆ స్థ‌ల య‌జ‌మాని అయిన‌ హ‌నుంత రాజుతో పాటు ఎం.ఎస్.రాజు  మ‌రికొంద‌రు…ఫిర్యాదు చేసారు   రెవిన్యూ నిబంధ‌న‌ల ప్ర‌కారం…స్పంద‌న‌కు వ‌చ్చిన ఫిర్యాదు దారునికి ర‌సీదు ఇవ్వాలి.. ఆ ర‌కంగా ఇవ్వ‌క‌పోవ‌డంతో.. బాధితులంతా మ‌ళ్లీ నేరుగా  జిల్లా రెవిన్యూ అధికారి ని క‌లిసి త‌మ గోడు వెళ్ల బోసుకున్నారు.

త‌క్ష‌ణం స్పందించిన డీఆర్ఓ….ర‌సీదు ఇచ్చే ఆప‌రేట‌ర్ ను పిలిచి… స్థ‌లం ఆక్ర‌మ‌ణ‌కు గురైందంటూ బాధితులు ఫిర్యాదు చేస్తే…ఆ విధంగా  ఇవ్వ‌క‌పోవ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించ‌డంతో… ఆక్ర‌మ‌ణ అంటూ బాదితుల‌కు ర‌సీదు ఇచ్చారు. దీంతో స్పంద‌న ద్వారా…సాక్షాత్ రాష్ట్ర రెవిన్యూ రికార్డుల‌లో తోట‌పాలెం ప్ర‌దీప్ న‌గ‌రంలోని స‌త్యసాయి న‌గ‌ర్ లే అవుట్ ఆక్ర‌మ‌ణ అంటూ వెళ్లిపోతుంద‌ని ఆ శాఖ‌కు చెందిన సీనియ‌ర్ అధికారి చెబుతున్నారు. కాగా..ఆ ఆక్ర‌మ‌ణ ఏంటీ అన్న కోణంలో  రెవిన్యూశాఖ్ లీగ‌లాగితే డొంకంతా క‌దల‌డం మాత్రం ఖాయం అని అంటోంది స‌త్యం న్యూస్.నెట్.

Related posts

న్యూ టార్గెట్: బాబాయ్ శ్రవణ్ మా నాన్నను కొట్టేవాడు

Satyam NEWS

Rules Changed: అంతర్జాతీయ క్రికెట్ లో కీలక నిబంధనల మార్పు

Satyam NEWS

వరంగల్ ఎంజీఎంలో కేటీఆర్ పిఏ పేరుతో డాక్టర్లపై దాడి

Satyam NEWS

Leave a Comment