28.7 C
Hyderabad
May 6, 2024 08: 43 AM
Slider విజయనగరం

మండు టెండ‌లో సీపీఎం రాస్తారోకో: పెంచిన పెట్రో ధ‌ర‌లు త‌గ్గించాల‌ని డిమాండ్

#vijayanagaram (2)

పెంచిన పెట్రోల్ ధ‌ర‌ల‌తో పాటు నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌ని కోరుతూ ఏపీలోని విజ‌య‌న‌గ‌రం కోట జంక్ష‌న్ వ‌ద్ద  సీపీఎం రాస్తారోకో నిర్వ‌హించింది. ఈమేరు ప‌ట్ట‌ణ పౌర సంక్షేమ సంఘం  కార్య‌ద‌ర్శి, సీపీఎం నేత రెడ్డి శంక‌ర‌రావు నేతృత్వంలో  కోట వ‌ద్ద రాస్తారోకో చేప‌ట్టారు.

కేంద్రంలో మోడీ ప్రభుత్వం అడ్డు అదుపు లేకుండా  పెట్రోలు డీజిల్ ధరలను  పెంచుకుంటూ పోతోంద‌ని మండిప‌డ్డారు. కేంద్రంలో మోడీ రెండో సారి అధికారం లో కి వచ్చాక మంచి నూనె ధ‌ర‌ 200.. గ్యాస్ ధ‌ర 1000.. పప్పులు.. ఉప్పు లు అన్ని నిత్యావసర సరుకుల ధరలు అమాంతంగా పెరిగిపోయి..ఆకాశంలో చుక్క‌ల‌ను చూపిస్తున్నాయ‌ని  విమ‌ర్శించారు. ఫలితంగా పేద.. మధ్య తరగతి ప్రజలకు బతుకు బారంగా ఉంద‌న్నారు..దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వ 4300 కోట్లు విద్యుత్ చార్జీలు పెంచింది. ఏడా.. పెడా ప్రజలపై భారాలు వేసి రాష్ట్రంలో ఎవ్వ‌రూ బ‌త‌క‌లేనంద స్థాయికి  ఈ జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకొచ్చింద‌న్నారు.

కేంద్ర ప్రభుత్వం పెట్టు బడి దార్లుకు లక్షల కోట్లు రాయితీ లు ఇస్తోంద‌ని…కానీ. పెంచిన అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు  త‌గ్గించే యోచ‌న‌లో లేద‌ని రెడ్డి శంక‌ర‌రావు విమ‌ర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లాకమిటి సభ్యులు పి. రమణమ్మ.. ఏ.జగన్ మోహన్ తది తరులు పాల్గొన్నారు.

Related posts

రాజ్ నాథ్ కు అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి పలుకరింపు

Satyam NEWS

సుప్రీంకోర్టు తీర్పు: మళ్లీ ప్రధాన మంత్రి అయిన ఇమ్రాన్ ఖాన్

Satyam NEWS

కోనసీమలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

Satyam NEWS

Leave a Comment