నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ .వై . సాయి శేఖర్ నాగర్ కర్నూల్ జిల్లా లోని తెల్కపల్లి మండలం రాకొండ గ్రామంలో, బల్మూర్ మండలం లోని మహాదేవ్ పూర్ గ్రామంలో 70 సిబ్బంది తో కలిసి కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ రోజు రాత్రి 7:00 నుండి 9:00 గంటల మధ్యలో నాగర్ కర్నూల్ SP డాక్టర్ .వై . సాయి శేఖర్ ఆధ్వర్యంలో డిఎస్పిలు,CI లు, SI లు, ASI లు, HC లు, పోలీస్ కానిస్టేబుల్స్ మొత్తం 70 మందితో కలిసి కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 130 ఇళ్లలో సోదాలు నిర్వహించి ద్విచక్ర వాహనాలు చెక్ చేశారు. ఈ సందర్బంగా ఎస్పీమాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు ఇక్కడ గ్రామం లో కొత్తగా వచ్చే వారిపై నిఘా ఉంచాలని, అసాంఘిక శక్తుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఉంటే వెంటనే పోలీసులకు 100 డైల్ ద్వారా గాని, ఇతర మార్గాల ద్వారా గాని, సమాచారం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా గ్రామస్తులు గ్రామ భద్రత నిమిత్తం తమ కాలనీ లో” నేను సైతం/కమ్యూనిటీ సిసి కెమెరా ” కార్యక్రమం లో భాగంగా సిసి కెమెరా లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నిజాలని బహిర్గతం చేసి సమస్య పరిష్కారానికి సిసి కెమెరాలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. అవసరమైతే స్థానిక నాయకులతో కలిసి వారి సహాయంతో జిల్లా లోని అన్ని గ్రామాలలో సి సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కార్డన్ అండ్ సర్చ్ లో భాగంగా గ్రామం లోని ప్రతి ఇంటికి తిరిగి వాహానాలను, పరిసరాలను తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో వాహానాలకు ఆర్సీ, లైసెన్స్, ఇన్సురెన్స్ తదితర ధృవపత్రాలు లేని వాహనాలు స్వాధీనపరుచుకున్నారు. రాకొండ గ్రామంలో నాగర్ కర్నూల్ డిఎస్పీ లక్ష్మినారాయణ, సి ఐ గాంధీ నాయక్, ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్సైలు , ఏఎస్సైలు కానిస్టేబుల్ లు బల్మూర్ మండలం లోని మహాదేవ్ పూర్ గ్రామం లో డిఎస్పీ నర్సింహులు, సి ఐ రామకృష్ణ, ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్సైలు , ఏఎస్సైలు కానిస్టేబుల్ లు పాల్గొన్నారు.
previous post