38.2 C
Hyderabad
April 28, 2024 22: 45 PM
Slider గుంటూరు

పాత పథకానికి కొత్త పేరు పెట్టుకున్న సీఎం జగన్

#TDP Aravindbabu

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికపై ఇటీవల నీతి ఆయోగ్ (2020-21) నివేదికలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ 19 వ స్థానంలో నిలిచింది. అక్షరాస్యతలో 27 వ స్థానంలో,మౌలిక సదుపాయాల్లో 13 వ స్థానంలో ఉంది. ఇది వైసీపీ ప్రభుత్వ పని తీరుకు నీతి ఆయోగ్ నివేదిక అద్దం పడుతోంది అని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు.

నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలో స్కూల్ బ్యాగులు, బెల్టు, షూ, సాక్స్ యూనిఫాంలు అందచేశారు. 8-9 తరగతుల విద్యార్థినులందరికీ సైకిల్లు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుడితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే…అందులో అవినీతి జరిగిందంటూ విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఈ సైకిళ్లు తుప్పుబట్టి శిథిలావస్థకు చేరుకున్నాయి అని ఆయన అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు గత ఏడాది రూ.650 కోట్లతో 1-5వ తరగతి విద్యార్థులకు మూడు జతల యూనిఫామ్స్,1 జత షూ, 2 జతల సాక్సులు, బెల్ట్, పాఠశాల పుస్తకాలు, వర్క్ బుక్స్, 6-10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బ్యాగు చంద్రబాబునాయుడు అందించారని డాక్టర్ చదలవాడ గుర్తు చేశారు.

1 నుంచి 10 వ తరగతి విద్యార్థులందరికీ విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు,ఇతర వస్తువులు పంపిణీ చేయడం కొత్త కాదు. వీటితో పాటు ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్ షిప్ లు పారదర్శకంగా అమలు చేశాం. అంగన్ వాడి కేంద్రాల్లో ఆరు రకాల సేవలు అందిస్తు ఆంగ్లంలో భోదించటానికి కూడా సిద్ధమవుతున్నా ప్రభుత్వం ఏకపక్షంగా ప్రజలకు అందుబాటులో ఉన్న అంగన్ వాడి కేంద్రాలను తీసుకెళ్లి ప్రాధమిక పాఠశాలల్లో కలపటం దుర్మార్గం అని ఆయన అన్నారు.

అంగన్ వాడి కేంద్రాలు గ్రామాల్లో గర్బిణిలకు , బాలింతలకు, చిన్న పిల్లలకు దగ్గరగా ఉండటంతో సులువుగా వచ్చి వెళుతున్నారు సేవలు ఉపయోగించుకుంటున్నారు. నేడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అంగన్వాడి కేంద్రాలను పాఠశాలలో కలపటం వల్ల వారంతా వచ్చే అవకాశం ఉండదని ఆయన తెలిపారు.

ప్రభుత్వం వెంటనే ఈ అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాడు-నేడు పేరుతో అవినీతికి తెరలేపారు. టీడీపీ హాయంలో పాఠశాల బిల్డింగు, మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్ కట్టించి రంగులు వేసి అందించాం. వైసీపీ ప్రభుత్వం కేవలం రంగులు మాత్రమే వేసి లక్షల్లో బిల్లులు తీసుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో రూ.25 లక్షలతో ఒక పాఠశాలను టీడీపీ అధునీకరిస్తే కేవలం రంగులు మార్చి వైసీపీ నేతలు రూ.35 లక్షల బిల్లులు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రచారంలో వైసీపీ ప్రభుత్వానికి మించి దేశంలో ఏ ప్రభుత్వం ఉండదనడంలో అతిశయోక్తి లేదు. పుట్టిన పాప నుంచి శ్మశానాల వరకు అన్నింటికి వైసీపీ రంగులు పులుముతూ అత్యున్నత న్యాయ స్థానంచే చివాట్లు తిన్న ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. ఆఖరికి పసి పిల్లల పాఠ్యపుస్తకాలకు, బెల్టులకు సైతం వైసీపీ రంగులు వేయడం సిగ్గుచేటు అని డాక్టర్ చదలవాడ అన్నారు.

గతంలో బెల్టుల పై స్కూల్ పేరు,స్కూల్ లోగో ఉండేది.దీన్ని కూడా వైసీపీ వర్గం పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. విద్యార్థుల భవిత్యం పై ప్రభుత్వానికి దశ – దిశ లేదు.జగన్ రెడ్డి దుశ్చర్యలతో నాణ్యమైన విద్యలో 3 వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 19వ స్థానానికి దిగజార్చారు.నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలను అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నారు. ఆంగ్లం మోజులో మాతృభాషకు తూట్లు పొడుస్తున్నారు,స్టేట్ సిలబస్ కాకుండా సీబీఎస్సీ అమలు చేస్తూ రాష్ట్ర విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.

జగన్ రెడ్డి తుగ్లక్ చర్యలతో ఎయిడెడ్ విద్యా సంస్థల వ్యవస్థ కనుమరుగు కానుందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళైనా ఇంత వరకు డీఎస్సీ ప్రకటించలేదు. ఉపాధ్యాయ ఖాళీలతో విద్యార్ధులకు సరైన విద్య అందని పరిస్థితి.ప్రతి బడికి ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తామన్న మాట కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యింది. ఊరికొక బ్రాందీ షాపు పెడుతున్న జగన్ రెడ్డి, ఊరికొక బడి మాత్రం వద్దనడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 3,654 ప్రాథమిక పాఠశాలలు మూతపడనున్నాయి. విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ విద్యార్థుల భవిష్యత్ తో జగన్ రెడ్డి ఆటలాడుతున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా 47,32,064 మంది పిల్లలకు స్కూలు బ్యాగులు పంపిణీలోను జగన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.భారతీ సిమెంట్ లో సిబ్బందికి యూనిఫాం సరఫరా చేసే డిల్లీకి చెందిన శివ్ నరేశ్ స్పోట్స్ కు స్కూల్ బ్యాగుల టెండర్‌ను నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారు.ఈ కంపెనీకి బ్యాగ్ తయారీలో అనుభవం లేకపోయినా కమీషన్ల కోసం ఈ కంపెనీకి కట్టపెట్టారు. పై పెచ్చు జార్ఖండ్ రాష్ట్రంలో ఈ కంపెనీని బ్లాక్ లిస్టులో కూడా పెట్టిన చరిత్ర ఉందని ఆరోపించారు.

ఒక్కో స్కూల్ బ్యాగ్ ధర జీఎస్టీతో కలుపుకొంటే దాదాపు రూ.148 వరకు పడుతుంది.కానీ ప్రస్తుతం స్కూల్ కాంప్లెక్స్ కు పంపిణీ చేస్తున్న బ్యాగ్ ధర ఓపెన్ మార్కెట్లో రూ.90 ఉంటుంది.ఈ లెక్కన చూస్తే ప్రభుత్వ ఖజానాకు వెళ్లే పన్నులను తీసేసిన తర్వాత ఒక్కో బ్యాగ్ పై దాదాపు రూ.35-40 వరకు బిడ్డకు మార్జిన్ ఉంటుంది.పసి పిల్లలకు ఇచ్చే బ్యాగుల్లోను రూ.18 కోట్లు అవినీతికి జగన్ రెడ్డి పాల్పడటం సిగ్గుచేటు అని ఆయన అన్నారు.

Related posts

మంచి మనసున్న కేసీఆర్ కే ఇలా చేయడం సాధ్యం

Satyam NEWS

సైబర్‌ ఆధారిత నేరాల కట్టడికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం

Bhavani

అరుదైన శస్త్ర చికిత్స చేసి 4కిలోల కణితి తొలగించిన డాక్టర్ శివప్రసాద్

Satyam NEWS

Leave a Comment