41.2 C
Hyderabad
May 4, 2024 17: 47 PM
Slider కరీంనగర్

వాట్స్ యాప్ గ్రూప్ అడ్మిన్ లకు కమలాసన్ రెడ్డి హెచ్చరిక

#KamalasanReddyIPS

సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి కమలాసన్ రెడ్డి హెచ్చరించారు.

కరీంనగర్ మత సామరస్యానికి ప్రతీక అని దాన్ని భగ్నం చేసేవారు ఎవరైనా సహించేది లేదని ఆయన అన్నారు. సామాజిక మాధ్యమాలలో పోస్టింగులు పెట్టేవారికి ఆయన ఈ కింది సూచనలు చేశారు.

1. కొందరు వ్యక్తులు మత విశ్వాసాలకు భంగం కలిగే విధంగా  సోషల్ మీడియా వేదికగా చేసుకొని అప్పుడప్పుడు పోస్టులను పెట్టె ప్రయత్నం చేస్తారు. సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని కోరుతున్నాము.

2.సోషల్ మీడియాలలో పోస్టు అవుతున్న తప్పుడు ప్రచారాలను చూసి ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. మత సమరస్యాలను దెబ్బతీసే విధంగా ఏవైనా మీ దృష్టికి వచ్చిన పోస్టులను ఇతర గ్రూపులకు షేర్ చేయకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలి.

కమిషనరేట్ లో ప్రత్యేక విభాగం ఏర్పాటు

3. సదరు తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి  చర్యలు తీసుకుంటాము. సోషల్ మీడియాలలో తప్పుడు పోస్టులు పెడుతున్నవారిని గుర్తించేందుకు కమిషనరేట్ కేంద్రంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాము.

4. తప్పుడు పోస్టులను ఇతరులకు షేర్ చేసినవారితోపాటు సదరు సోషల్ మీడియా గ్రూపులకు చెందిన నిర్వాహకులపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాము.

5. నిన్న కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ నగరంలో జరిగిన అల్లర్ల గురించి కొంతమంది కావాలని మతాల మధ్య గొడవలు సృష్టించే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. గ్రూప్ ఆడ్మిన్ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం.

6. సోషల్ మీడియా ను ఒక సుహృద్భావ వాతావరణం లో ప్రజా సంబంధాలను పెంపొందించేందుకు, సమాచారాన్ని వేగంగా చేరవేసే ఒక వేదికగా వినియోగించాలి కానీ, సమాజంలో  వైషమ్యాలు పెంచేలా, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా, ఇతరుల వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బ తీసేలా దుర్వినియోగం చేయడం తీవ్రమైన నేరం.

7. కల్పితమైన విషయాలతో, ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా దుర్వినియోగ పరిచే వ్యక్తులే కాకుండా వాట్సాప్ గ్రూపుల లో ఇలాంటి విషయాలను షేర్ చేస్తే ఆ గ్రూప్ అడ్మిన్ లపై కూడా సైబర్ చట్టాల కింద నాన్ బెయిలబుల్  కేసులు నమోదు చేస్తాము.

8. అంతే కాదు ఒక సారి మత పరమైన వైషమ్యాలు రెచ్చగొట్టే కేసులు నమోదు అయిన వ్యక్తులపై సంబంధిత పోలీస్ స్టేషన్లో Communal sheets తెరుస్తాము. అది వారి జీవితాంతం వారికి మచ్చగా మిగిలిపోతుంది.

విద్యార్ధులూ జాగ్రత్తగా లేకుంటే మీ భవిష్యత్తుకే దెబ్బ

9. విద్యార్థులపై, యువకులపై ఒక సారి ఇలాంటి కేసులు నమోదు అయితే వారు భవిష్యత్తులో ఉద్యోగాలకు అనర్హులు అవుతారు. సమాజంలో కూడా వారిని వెలివేసినట్లు చూస్తారు.

10 ఉద్యోగ రీత్యా గాని, ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకుంటే  వారికి పాస్ పోర్ట్, వీసా పొందడానికి కూడా అనర్హులు  అవుతారు.

11.  యువకులు అనాలోచితమైన, అవాస్థవమైన విషయాలను నమ్మి కేసులలో ఇరుక్కుని తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని తెలియ జేస్తున్నాము.

12 Whatsapp గ్రూప్ అడ్మిన్ లు కూడా తమ వాట్సాప్ గ్రూప్ లో వివిధ వ్యక్తులు షేర్ చేసే విషయాలపై అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము.

మీ శ్రేయస్సు కోరే… వి.బి కమలాసన్ రెడ్డి, IPS, కమిషనర్ ఆఫ్ పోలీస్, కరీంనగర్.

Related posts

ఇద్దరు అనుమానస్పద మృతి

Bhavani

అందరూ సంఘటితమైతేనే హిందూ రాజ్యం

Satyam NEWS

ఎట్టకేలకు కళ్లు తెరచిన తెలంగాణ సీఎం కేసీఆర్

Satyam NEWS

Leave a Comment