హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని ముచ్చింతల్ లోని చిన జీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న తిరునక్షత్ర వేడుకలకు నేడు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హాజరయ్యారు. చిన జీయర్ స్వామి పుట్టిన రోజు సందర్భంగా ఈ వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా ఈ ఉత్సవాలకు హాజరైన విషయం తెలిసిందే. వేడుకలకు హాజరైన గవర్నర్ తమిళిసై కి చిన జీయర్ స్వామి స్వాగతం పలికారు. గవర్నర్ కు ఆయన తీర్థ ప్రసాదాలు అందచేశారు.
previous post