26.2 C
Hyderabad
May 19, 2024 20: 36 PM
Slider ఖమ్మం

వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు ప్రధానం

#Collector V.P

వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు ప్రధానమని, తదనుగుణంగా జిల్లాలో డెంగ్యూ నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. టిటిడిసి సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య, శాఖ, అనుబంధ శాఖల అధికారులతో డెంగ్యూ నియంత్రణ ముందస్తు చర్యల సన్నాహక సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు.

గతంలో నమోదైన కేసులపై సమీక్షించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో గత రెండు మూడు సంవత్సరాలుగా కేసులు అధికంగా నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నియంత్రణ చర్యలు చేపట్టాలని అన్నారు.

గత సంవత్సరం 3919 నమూనాలు డెంగ్యూ పరీక్షలు చేపట్టగా, 18 పాజిటివ్ కేసులు వచ్చినట్లు ఆయన తెలిపారు. పల్లె, బస్తీ దవాఖానాల వైద్యులు, హెల్త్ సూపర్వైజర్లు, వైద్య సిబ్బందికి శిక్షణా కార్యక్రమం చేపట్టి, డెంగ్యూ కేసులకు వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, దీంతో ప్రధాన ఆస్పత్రిపై వత్తిడి తగ్గుతుందని అన్నారు.

పంచాయతీ రాజ్ శాఖ నుండి, ఎంపిడిఓ లు మండల స్థాయిలో వర్క్ షాప్ లు నిర్వహించి, ఎంపిపి, జెడ్పిటిసిలు, సర్పంచులు, ఎంపిటిసిలు ప్రజాప్రతినిధులు అందరిని భాగస్వామ్యం చేయాలన్నారు. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని హై రిస్క్ ప్రాంతాలను గుర్తించి, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పరీక్షలు ఎక్కువగా చేపట్టాలని, గుర్తించిన పాజిటివ్ కేసులకు మెరుగైన వైద్యం అందించి, వ్యాప్తి చెందకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆయన అన్నారు. జూలై మాసంలో 10 వేల పరీక్షలు చేపట్టేలా కార్యాచరణ చేయాలన్నారు.

పాఠశాలల్లో పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించి, డెంగ్యూ పట్ల చైతన్యం తేవాలన్నారు. ప్రధానంగా నీటి నిల్వలు లేకుండా చూడడం ద్వారా డెంగ్యూ ను పూర్తిగా అరికట్టవచ్చని ఆయన తెలిపారు. జిల్లాలో డ్రైడే కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని, మున్సిపాలిటీ పరిధిలో కార్పొరేటర్లు, పంచాయతీ పరిధిలో సర్పంచులు, వార్డ్ మెంబర్ లను భాగస్వాములు చేసి ఇంటితోపాటు ఇంటి పరిసరాల లో నీటి నిల్వలు లేకుండా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి చైతన్య పరచాలని కలెక్టర్ అన్నారు.

ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో గురువారం డ్రైడే తప్పనిసరిగా చేపట్టాలని ఆయన అన్నారు. మంగళ, శుక్రవారాల్లో అర్బన్, రూరల్ ప్రాంతాల్లో డ్రై డే కార్యక్రమాలు చేపట్టాలని, ఆదివారం ఇండ్ల వద్ద డ్రై డే చేపట్టేలా విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామాలలో ఆశావర్కర్లు, మున్సిపాలిటీలలో మెప్మా ఆర్పి లు ప్రతి ఇంటికి వెళ్లి ఇళ్లలో నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రత పాటించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా సంబంధిత జిల్లా స్థాయి అధికారులు సత్వర చర్యలు చేపట్టాలన్నారు.

అర్బన్ ప్రాంతాలతో పాటు గ్రామాలలోని టైర్ల పంచర్ షాపులు, స్క్రాప్ దుకాణాల జాబితాను సిద్ధం చేసి, పరిశుభ్రత పాటించుటకు, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని నోటీసులు ఇవ్వాలని, నిబంధనలు పాటించని షాపుల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా గ్రామాలలో నీటి నిల్వలను తొలగించాలని, నీటి నిల్వలలో ఆయిల్ బాల్స్, గంబూషియ చేప పిల్లలను వదలాలని, యాంటీ లార్వా స్ప్రేయింగ్, ఫాగింగ్ పనులు ముమ్మరంగా జరగాలని, పారిశుద్ధ్య పనులు, మురుగు కాలువల పూడికతీత పనులు నిరంతరాయంగా కొనసాగాలని ఆయన తెలిపారు.

నీటి ట్యాoకులను ప్రతి 15 రోజులకు క్లోరినేషన్ చేయాలని, దీనికి లాగ్ బుక్ నిర్వహించాలని ఆయన అన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన తయారు వర్కర్లు, హాస్టల్ కుక్ లకు టైఫాయిడ్ పరీక్షలు చేపట్టాలన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి, ఏ.ఎన్.ఎంలు సమన్వయంతో సబ్ సెంటర్ల ద్వారా పారిశుధ్య ఆరోగ్య పరిరక్షణ చర్యలు పటిష్టంగా జరగాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పకడ్బందీగా చేపట్టాలని, పాఠశాలలు, కార్యాలయాల్లో ప్రతిఒక్కరికి అందేలా పటిష్ట కార్యాచరణ చేయాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కోఆర్డినేటర్ డా. రాజేంద్ర కుమార్ సింగ్ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, బోధకాలు నివారణ గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.కార్యక్రమంలో ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ చే డ్రై డే, డెంగ్యూ నివారణ విషయమై రూపొందించిన కరపత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు.

Related posts

పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశ పెట్టి అమలు చేయాలి

Satyam NEWS

అంతర్వేది రధం తగలబెట్టిన వారిని కఠినంగా శిక్షిస్తాం

Satyam NEWS

కరీంనగర్ కు పర్యటక శోభ: లేజర్ షో… వాటర్ ఫౌంటెన్.. యాంఫీ థియేటర్

Satyam NEWS

Leave a Comment