38.2 C
Hyderabad
April 29, 2024 21: 03 PM
Slider కరీంనగర్

కరీంనగర్ కు పర్యటక శోభ: లేజర్ షో… వాటర్ ఫౌంటెన్.. యాంఫీ థియేటర్

#lagershow

కరీంనగర్ మానేరు ఫ్రంట్ భారత దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నేడు కలెక్టరేట్ సమావేశా మందిరంలో ఆస్ట్రేలియా కు చెందిన లేజర్ విజన్ కంపెనీ, ఇండియాలోని FPA కంపెనీల ప్రతినిధుల బృందం మానేరు రివర్ ఫ్రంట్ లో నిర్మించే వాటర్ ఫౌంటెన్, లేజర్ షో, యాంఫీ థియేటర్ ల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు.

అనంతరం మానేరు రివర్ ఫ్రంట్ ప్రాంతాన్ని ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందంతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ సందర్శించారు ఈ సందర్భంగా వాటర్ ఫౌంటెన్ లేజర్ షోకు అనువైన ప్రదేశాన్ని సర్వే చేసి త్వరలోనే డిపిఆర్ సిద్ధం చేయాల్సిందిగా వారిని కోరారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ 410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే సివిల్ వర్క్ లు ప్రారంభించమని, భారీ వర్షాల నేపథ్యంలో వరదల వల్ల పనులు మందగించాయని రానున్న వేసవికాలం వరకు పనుల్లో వేగం పెంచి  యేడాదిన్నర లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

మానేరు రివర్ ఫ్రంట్ పరిసరాలను సుందరీకరించేందుకు పర్యాటక శాఖ నుండి 100 కోట్లు మంజూరయ్యాయని, ఫ్రంట్ మధ్యలో నిర్మించే వాటర్ ఫాంటేన్ ,లేసర్ షో ,యాంఫీ థియేటర్ లను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. లేజర్ షో, వాటర్ ఫౌంటెన్ పనులకు 6 నెలల్లో డీపీఆర్  పూర్తిచేసి టెండర్లు పిలుస్తామని తెలిపారు.

సీఎం కేసీఅర్ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మానేరు రివర్ ఫ్రంట్ ను రాబోయే ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ లో ఏర్పాటు చేసే వాటర్ ఫౌంటేన్, లేజర్ షో, అంఫీ థియేటర్ల కోసం ఆస్ట్రేలియాకు చెందిన లేజర్ విజన్ కంపెనీ ప్రతినిధులతో కలిసి మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అంతకుముందు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో అందుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను తిలకించారు. 410 కోట్లతో చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ లో పర్యాటక అభివృద్ది కోసం 100 కోట్లు కేటాయించామన్నారు. లేజర్ విజన్ కంపెనీకి దుబాయ్, మక్కా, వియత్నాం, హాంకాంగ్, సింగపూర్ లలో పలు ప్రాజెక్టులు చేసిన అనుభవం ఉందన్నారు.

ఇక్కడ కూడా మంచి వాటర్ ఫౌంటేన్స్, లేజర్ షోల డిజైన్లు తయారు చేసేందుకు ఈ సంస్థ ఇండియాలోని ఎఫ్.పి.ఏ కంపెనీతో కలిసి సర్వే చేస్తుందన్నారు. పదిహేను రోజుల్లో డిపిఅర్ తయారు చేసి టెండర్లు పిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మేయర్ సునీల్ రావు, కలెక్టర్ కర్ణన్ లు పాల్గొన్నారు.

Related posts

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే

Satyam NEWS

జర్నలిస్టు శ్రీనివాస్ పై అక్రమ కేసును ఎత్తివేయాలి

Satyam NEWS

రాజ్యాంగాన్ని మార్చే హక్కు సీఎం కేసీఆర్ కు లేదు

Satyam NEWS

Leave a Comment