Slider తూర్పుగోదావరి

అంతర్వేది రధం తగలబెట్టిన వారిని కఠినంగా శిక్షిస్తాం

#VellampalliSrinivas

రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, పినిపె విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నేడు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో పర్యటించారు. ఆలయ ఆవరణలో రథం దగ్ధమైన ప్రదేశాన్ని మంత్రులు పరిశీలించి జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. వచ్చే కల్యాణోత్సవాలకు ప్రభుత్వం తరఫున నూతన రథాన్ని నిర్మిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.

రథం దగ్ధమైన నేపథ్యంలో ఆలయ ఇన్‌ఛార్జ్‌ సహాయ కమిషనర్ చక్రధర్ రావును విధులను నుంచి తొలగించామని, మరో ఇద్దరు ఆలయ ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి తెలిపారు.

ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా దేవాలయాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

Related posts

హుజూర్ నగర్ అభివృద్ధికి శాయశక్తులా కృషి

Satyam NEWS

కాప్రా సర్కిల్లో ఇష్టారాజ్యంగా  రోడ్డు కటింగ్ లు

Satyam NEWS

విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ ఎంతో అవసరం

Satyam NEWS

Leave a Comment