25.7 C
Hyderabad
May 18, 2024 09: 48 AM
Slider విజయనగరం

పాఠశాల పిల్లలతో మమేకమైన పోలీసు బాస్

#rakhi

రక్షాబంధన్ సందర్భంగా “మేము మీకు రక్ష’ అంటూ రాఖీ కట్టించుకున్న విజయనగరం ఎస్పీ

“మేము మీకు రక్ష’..మీతో పాటు మొత్తం సమిజానికే పోలీసులు రక్ష” అన్న స్పూర్తిని నింపేందుకు విజయనగరం జిల్లా పోలీసు బాస్ దీపికా.. ఓ బృహత్తర మైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ పురస్కరించుకుని… జిల్లా లోని  ముడిదాం..”ఇన్ స్పైర్ స్కూల్ ”  పిల్లలచే రక్షాబంధన్ సందర్భంగా వారిచే రాఖీ కట్టించుకున్నా రు. 

సమాజ రక్షకులు “పోలీసులు” అన్న స్కూలు పిల్లల ఆలోచన గొప్పది.

దిశ మహిళా పి.ఎస్. లో “రక్షా బంధన్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ‘ఇన్స్పైరో” స్కూలు విద్యార్థులు

ఇతరుల నుండి రక్షణ మాత్రమే పొందేందుకు కాకుండా స్వశక్తితో ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ

విజయనగరం జిల్లా లోని మహిళా దిశ మహిళా పోలీసు స్టేషనును ముడిదాం గ్రామం వద్ద గల “ఇన్స్పైరో” స్కూలు విద్యార్థులు  సందర్శించారు.సమాజ రక్షకులుగా పోలీసులను గుర్తించి, పోలీసు అధికారులు, సిబ్బందికి “రక్ష బంధన్” కార్యక్రమంలో భాగంగా రాఖీలను కట్టి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎం. దీపిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ సాధారణంగా “రక్షా బంధన్” కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ తమ ఇంటిలో గల వారి సోదరులకు రాఖీ కట్టి, తమ అభిమానాన్ని చాటుకుంటారు. కానీ, “ఇన్స్పైరో” స్కూలు విద్యార్ధులు పోలీసులను సమాజ రక్షకులుగా, తమ సోదరులు గా భావించి, రాఖీలను కట్టేందుకు నేడు పోలీసు స్టేషనుకు రావడం, ఇటువంటి చక్కని ఆలోచన కలిగి ఉండడం చాలా గొప్ప విషయమన్నారు.

పోలీసులు నిత్యం ఎంతో ప్రతికూల వాతావరణంలో పని చేస్తూ, తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, విధులు నిర్వహిస్తుంటారన్నారు. ప్రజలు పోలీసుల సేవలను గుర్తించినపుడు వారు చేసిన కష్టాన్ని మరిచిపోతారన్నారు. నేడు పిల్లల రూపంలో తమకు అటువంటి సంతోషం కలిగిందన్నారు. మహిళల రక్షణకు ప్రభుత్వం మహిళల రక్షణకు ప్రత్యేకంగా చర్యలు చేపడుతూ, మహిళా పోలీసు స్టేషనులను “దిశ పోలీసు స్టేషన్లు”గా మార్పు చేసిందన్నారు.

అంతేకాకుండా, 24గంటలు అందుబాటులో ఉంటూ, మహిళల రక్షణకు ప్రత్యేకంగా దిశా ఎస్.ఓ.ఎస్. మొబైల్ యాప్ ను రూపొందించిందన్నారు. ఇప్పటికే జిల్లాలో 5లక్షలకు పైగా దిశ యాప్ను డౌన్లోడు చేయించి, ప్రజలకు అందుబాటు లో ఉంటున్నామన్నారు. “రక్షా బంధన్” అంటే రక్షణ కొరకు ఇతరులపై ఆధారపడి ఉండడం కాకుండా, స్వచ్ఛందంగా ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉండే విధంగా విద్యార్థినులు తయారవ్వాలన్నారు.

దిశ యాప్ మీ మొబైల్స్ ఉంటే రక్షణ మీ వెంటే ఉంటుందని, మీకు ఏ సమస్య వచ్చినా, దిశ ఎస్.ఓ.ఎస్. బటన్ ప్రెస్ చేసి, సహాయం పొందవచ్చునన్నారు. మొబైల్ లేకుంటే అందుబాటులో ఉన్న పోలీసులను కలిసి, సహాయాన్ని, రక్షణను పొందవచ్చునని విద్యార్ధినులకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక సూచించారు.

అనంతరం ఇన్స్పైరో స్కూలు ప్రిన్సిపాల్ మరియు అకాడమిక్ డైరెక్టరు రవి కే. మండ మాట్లాడుతూ రక్షా బంధన్ గురించి పాఠశాలలో విద్యార్థులతో చర్చించినపుడు, చాలామంది విద్యార్ధులు కోవిడ్ సమయంలో పోలీసులు మంచి సేవలు అందించి, సమాజానికి రక్షకులుగా నిలిచారని, వారికి రాఖీలు కడితే బాగుంటుందన్నారు.

పోలీసులు విద్యార్థులకు స్ఫూర్తి ప్రధాతలుగా, శాంతికి నాయకులుగా, మంచికి ప్రోత్సాహకులుగా సమాజంలో విధులు నిర్వహిస్తున్నారని, అటువంటి వ్యక్తులకు తమ స్కూలు విద్యార్థులు రాఖీ కట్టడం, తమ విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తుందని అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.

అనంతరం, ఇన్స్పైరో విద్యార్థులు జిల్లా ఎస్పీ ఎం.దీపిక  నుదుట కుంకుమ పెట్టి, హారతి ఇచ్చి, రాఖీ కట్టి, స్వీట్ తినిపించి, కండువా వేసి, పువ్వులను జల్లి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. అదే విధంగా డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు మరియు ఇతర పోలీసు సిబ్బందికి ఇన్స్పైరో విద్యార్థులు పోలీసులను సమాజ రక్షకులుగా, తమ సోదరులుగా భావించి, రాఖీలును కట్టారు.

జిల్లా ఎస్పీ ఎం.దీపిక కూడా విద్యార్థులకు బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో దిశ డిఎస్పీ టి.త్రినాధ్, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, వన్ టౌన్  సీఐ డా.బి. వెంకటరావు, టూటౌన్ సీఐ సిహెచ్. లక్ష్మణరావు, రూరల్ సిఐ టివి తిరుపతిరావు, ఇన్స్పైరో స్కూలు ప్రిన్సిపాల్ రవి కే మండ, వైన్ ప్రిన్సిపాల్ ఎస్. రాగసుధ, ఎస్ఐలు కే. లక్ష్మణరావు, నర్సింగరావు, కేటిఆర్ లక్ష్మి, శ్యామల, ఆర్ఎస్ఐ శ్రీనివాసరావు, ఎఎస్ఐ రజని మరియు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.

Related posts

KCR బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్

Satyam NEWS

“టాప్ గేర్” సినిమాతో ఆది కేరీర్ బ్రేకులు లేకుండా సాగాలి

Satyam NEWS

కార్మికులను నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్

Satyam NEWS

Leave a Comment