25.2 C
Hyderabad
May 16, 2024 20: 26 PM
Slider సినిమా

“టాప్ గేర్” సినిమాతో ఆది కేరీర్ బ్రేకులు లేకుండా సాగాలి

#topgear

యంగ్ అండ్ లవ్‌లీ హీరో ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పుడు ‘టాప్ గేర్’ వేసి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో  K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఈ టాప్ గేర్ సినిమా తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సర్వ హంగులతో ఈ సినిమాను రూపొందించారు.

ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదల కాబోతున్న సందర్భంగా చిత్ర  యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి  హీరో సందీప్ కిషన్, సాయి కుమార్, బెక్కం వేణుగోపాల్, యన్ శంకర్, నిర్మాతలు దామోదర ప్రసాద్, అనిల్ సుంకర, రాధా మోహన్, నటుడు డి. యస్. రావు, డైరెక్టర్ శేఖర్ సూరి, సత్తి బాబు, నారాయణ్ గౌడ్, హరీష్, సుదర్శన్ రెడ్డి  తదితరులు ముఖ్య అతిదిలుగా పాల్గొన్నారు. హీరో సందీప్ కిషన్, డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు టాప్ గేర్ బిగ్ టికెట్ ను  లాంచ్ చేశారు. అనంతరం డైలాగ్ కింగ్ సాయికుమార్ మాట్లాడుతూ.. మా నాన్న తో మొదలైన మా జర్నీ ఇప్పుడు ఆది వరకు వచ్చింది.

ఆదిని ఒక క్రికెటర్ అవ్వాలని అనుకొన్నాము. కానీ మెగాస్టార్  అన్నయ్య సాంగ్ తో ఇండస్ట్రీ కు వచ్చాడు. మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అందరూ ఈ “టాప్ గేర్” సినిమా ట్రైలర్, టీజర్ బాగుందని మెచ్చుకుంటున్నారు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా మా ఆది కి బిగ్ బ్రేక్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ కొత్త సంవత్సరంలో వస్తున్న ఈ సినిమా నిర్మాత శ్రీధర్ రెడ్డి గారి కి  నిజంగా “టాప్ గేర్” అవ్వాలి. మ్యూజిక్ డైరెక్టర్ హర్ష  మంచి మ్యూజిక్ ఇచ్చాడు. వెన్నెల వెన్నెల సాంగ్ చాలా బాగుంది. ఆదికి  శశికి, హర్ష, శ్రీధర్ రెడ్డి లకు అందరికీ ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

హీరో సందీప్ కిషన్  మాట్లాడుతూ..

శశి  నాకు ఏడు సంవత్సరాలనుండి మంచి ఫ్రెండ్.తను ఈ సినిమాకు దర్శకత్వం వహించడం చాలా హ్యాపీ గా ఉంది. ప్రస్థానం సినిమాతో  నా జర్నీ  స్టార్ట్ అయింది. ఆ సినిమాకు నేను కొత్త అయినా సాయి కుమార్ గారు నన్ను చాలా బాగా చూసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఆది నాకు బెస్ట్ ఫ్రెండ్.  ఈ సినిమాలో తను చాలా బాగా నటించాడు.తనకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వడమే కాకుండా ఈ “టాప్ గేర్” సినిమాతో ఆది కేరీర్ బ్రేక్ లేకుండా సాగిపోవాలి.

అలాగే రాబోయే 2023 లో ఆది తో నేను ఒక సినిమా తియ్యడానికి ప్లానింగ్ చేస్తున్నాను. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ “టాప్ గేర్” సినిమా నిర్మాత శ్రీధర్  రెడ్డి గారికి, శశికి టెక్నిషియన్స్ అందరికీ ఈ సినిమా పెద్ద విజయం  సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. చిత్ర నిర్మాత శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. దర్శకుడు  శశి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను.

హీరో, హీరోయిన్స్ ఆది, రియా లిద్దరూ చాలా బాగా నటించారు.ఎన్నో హిట్ చిత్రాలకు కెమెరామెన్‌గా పని చేసిన సాయి శ్రీరామ్ ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్ ఈ సినిమాకు అందించిన సంగీతం, నేపథ్య సంగీతం హైలెట్ అవ్వనుంది. ఈ సినిమాకు పని చేసిన వారందరూ తమ సినిమా అనుకొని ఓన్ చేసుకొని ఈ సినిమాకు వర్క్ చేయడం వలన ఈ సినిమా చాలా బాగా వచ్చింది.

ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న టాప్ గేర్ సినిమా ఆది ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని అన్నారు. హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. శ్రీధర్ గారు చాలా పాజిటివిటి ఉన్న వ్యక్తి. సినిమాను ఇంకా బాగా తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్ళాలి అనుకునే వ్వక్తి. తను ఇంకా ఇలాంటి సినిమాలు చాలా తియ్యాలి. శశి గారు చాలా డెడికేషన్ ఉన్న వ్వక్తి. తను ఈ సినిమాకు చాలా హార్డ్ వర్క్ చేశారు. సాయి శ్రీరామ్ గారి ఫ్రెమింగ్ చాలా బాగుంటుంది.

తను నన్ను, రియా ను చాలా బాగా చూపించారు..హర్ష  గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సిధ్ శ్రీరామ్ పాడిన వెన్నెల వెన్నెల పాట పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది. దీంతో సినిమా మీద ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ ఏర్పడింది. టెక్నిషియన్స్ అందరు ఫుల్ సపోర్ట్ చేశారు. అందుకే సినిమా బాగా వచ్చింది..ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా “టాప్ గేర్” సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు

ఆది సాయి కుమార్, రియా సుమన్, బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్  తదితరులు

టెక్నీషియన్స్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.శశికాంత్, సినిమాటోగ్రాఫర్: సాయి శ్రీరామ్, మ్యూజిక్: హర్షవర్ధన్ రామేశ్వర్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: రామాంజనేయులు, కాస్ట్యూమ్ డిజైనర్: మాన్వి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి, ప్రొడ్యూసర్: K. V. శ్రీధర్ రెడ్డి, బ్యానర్: శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్, ప్రెజెంట్స్: ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్, పీఆర్వో: సాయి సతీష్, పర్వతనేని

Related posts

సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

Satyam NEWS

బస్టాండ్ లో నాటు బాంబు కలకలం

Murali Krishna

ఒపీనియన్: అరక పట్టిన నీకు అందలమెప్పుడు రైతన్నా

Satyam NEWS

Leave a Comment