25.7 C
Hyderabad
May 19, 2024 08: 17 AM
కవి ప్రపంచం

మౌన వేదనాగీతం

#J.Shyamala1

కరోనా కరాళ నృత్యం వేళ

పంద్రాగస్టు పండగ

నిత్యం మ్రోగుతున్న మరణమృదంగం

తీరని గర్భశోకంతో తల్లి భారతి

కొవిడ్ క్రోథ జ్వాలలో

శాపంగా మారిన శార్వరి

అయినా…

జెండా ఊంఛా రహే హమారా అని

ఎలుగెత్తి పాడాలనే ఉంది

కానీ మాస్క్ తో మూసిన నోటితో పాడేదెలా?

సారే జహా సె అచ్చా అని

ఆనందంగా ఆడాలనే ఉంది

కానీ సోషల్ డిస్టెన్స్ తో ఆడేదెలా?

భక్తితో పతాక వందనం చేద్దామనే ఉంది

కానీ శానిటైజర్ పై దృష్టితో వందనమెలా?

ఈ నా మౌన వేదనాగీతం

భారతీ నీకు అంకితం

జె.శ్యామల

Related posts

కెరటం నేర్పే పాఠం

Satyam NEWS

ఉపజ్ఞ కు ఉపద

Satyam NEWS

ప్రేమంటే

Satyam NEWS

2 comments

Ramana Velamakakanni October 8, 2020 at 3:50 PM

15th August poem by Syamala is very realistic. Abhinandanalu.

Reply
Mramalakshmi January 16, 2021 at 5:55 PM

మౌన వేదనాభరిత కవిత ?

Reply

Leave a Comment