28.7 C
Hyderabad
April 27, 2024 04: 57 AM
Slider కవి ప్రపంచం

ఉపజ్ఞ కు ఉపద

#Radium Old City

అది బోధివృక్షం కాదు

అది వెర్రి మర్రి వృక్షం కాదు

తానూ పెరుగుతూ

తనను ఆశ్రయించిన వాటికీ

రసజ్ఞానాన్ని అందించి

ఊత మిచ్చిన చూతఫల వృక్షం.

పుట్టిన నేల కోసం

తపన తాపత్రయం

తను మాటల్లో కాకుండా

చేతల్లోచూపిన ధీశాలి.

నేలను దొరల కబంధ చెర తప్పించి

భూసంస్కరణ చట్టానికి చుట్టమయ్యాడు

మొక్క పెరిగి సంస్కరణ వృక్ష మయ్యింది

రాజులింట పుట్టకున్న

దేశానికి రాజయ్యాడు

ఆర్థిక పుష్టికి స్రష్టయ్యాడు

రచనకు అక్షర రంగులద్ది సాహితీ తోటలో

వాడని  సుగంధ పారిజాతమయ్యాడు

తెలంగాణ మాగాణి మరువపు మొలక

చిరునవ్వు మోము వెన్నెల తునక

మన మనిషి

జనం మనిషి

దేశం మెచ్చిన మహా మనీషి

రేడియమ్, పాతనగరం, హైదరాబాద్, 9291527757

Related posts

పోటాపోటీగా భగత్ సింగ్ వర్ధంతి…!

Satyam NEWS

విషజ్వరాల నుంచి రక్షణ కోసం గిరిజనులకు దోమతెరల పంపిణీ

Satyam NEWS

తెలుగు ప్ర‌జ‌ల‌కు జైలు నుంచి చంద్ర‌బాబు బ‌హిరంగ లేఖ

Satyam NEWS

Leave a Comment