38.2 C
Hyderabad
April 29, 2024 14: 33 PM
Slider కవి ప్రపంచం

కెరటం నేర్పే పాఠం

#Devalapally Reddappareddy

సముద్రంలోని కెరటాలు

ఒక్కో క్షణంలో ఆకాశాన్నే అందుకునేలా ఎగిసి పడతాయి

మరో క్షణం భుజాలమీద మోయలేనన్ని భాధ్యతల బరువులేవో ఉన్నాయనేలాగా కుంగిపోతాయ్

పైకి యెదుగుతున్నప్పుడు

కిందకి పడిపోతామేమో అనే భయంతో ముందడుగు వేస్తుంటే..

ఎదుగుదలలో ఉన్న అనుభూతిని ఆస్వాదించగలమా..?

కిందకి పడిపోతున్నప్పుడు

పడిపోవడం నాకు ఏమి కొత్తకాదు

ఎలాగో మళ్ళీ పుంజుకుంటా అని అనుకోవడం

ఒక కొత్త ఆలోచన కాదా..!!

జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా

ఎన్ని గెలుపులు వచ్చినా

సమయం సందర్భం ప్రకారం

లేస్తూ పడుతూ ఉంటే

మనం వెళ్లే దూరం భారం అనిపిస్తుందా..?

పడిన ప్రతీసారీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే..

తిరిగి మళ్ళీ ఆకాశాన్ని అందుకోడానికి కెరటాలకు ఇంకొక ఘడియ చాలు

ఇవేకదా కెరటాలు మనకు నేర్పించే పాఠాలు

దేవలపల్లి ప్రహాసన్ రెడ్డెప్ప రెడ్డి, చరవాణి: 0490547521

Related posts

ఒక యువకుడ్ని నరికి చంపిన అగంతకులు

Satyam NEWS

Controversy: కష్టమర్ సర్వీస్ గా మారిన ఐఏఎస్ లు

Satyam NEWS

కోవాక్సిన్ కన్నా సమర్ధంగా పని చేస్తున్న కోవి షీల్డ్ వ్యాక్సిన్

Satyam NEWS

Leave a Comment