37.2 C
Hyderabad
April 30, 2024 12: 56 PM
కవి ప్రపంచం

ప్రేమంటే

#Purimalla Sunanda Khammam

కన్నుల్లో ఒదిగే కలల సౌధం కాదు

వెన్నెల్లో మరిగే ఆకాంక్షల ఆరాటమూ కాదు

తనువుల ఆలింగనం కాదు

కోరికల కొలమానమూ కాదు…

క్షణికానందాలకై వెంపర్లాడటం కాదు

కన్నవారి కన్నుగప్పి యధేచ్ఛగా తిరగడమూ కాదు…

ప్రేమంటే

శ్వాసిస్తున్నంత సహజంగా ధ్యానించడం

పెదవులపై ఒలికే మధుర సుధలు

ఎద లోయల్లో పొంగి పొరలడం!

కన్నుల్లోంచి జాలువారే కాంతి పుంజాలు

హృదయ క్షేత్రాల్లోకి  నేల రాలిన చినుకులా

వసంతాలై ప్రవహించడం..

అందరి మన్ననలు పొంది

ఎదుటి మదిలో అద్దంలా ప్రతిఫలించడం..

విరిసిన ప్రేమ పరిమళాలను

కడదాకా పవిత్రంగా కాపాడుకోవడం

నిండు నూరేళ్ళ జీవితానికి

ప్రమాణ స్వీకారం చేసి

ప్రణయ సంతకాన్ని చేయడమే ప్రేమంటే..

అరుణారుణ కాంతులతో ప్రకాశిస్తూ

ఆదర్శ ప్రాయంగా జీవితాన్ని మలచుకోవడమే ప్రేమంటే..

 వురిమళ్ల సునంద, ఖమ్మం

Related posts

బోన్సాయ్ మొక్క

Satyam NEWS

ఆచార్యదేవ

Satyam NEWS

ఆకలే అసలు వైరస్

Satyam NEWS

Leave a Comment