25.7 C
Hyderabad
May 19, 2024 09: 45 AM
కవి ప్రపంచం

పీవి ఠీవి

#Addagudi Umadevi

తెలంగాణమునుదయించి

పంచెకట్టుకే వన్నెతెచ్చిన  తెలుగు బిడ్డ

నిజాం ప్రభుత్వాన్నెదిరించి వందేమాతరగీతమాలపించిన

ధిక్కారగళ ధీరుడు

పత్రికా విలేకరిగానూ,

కాతీయపత్రిక నడిపి  జయపేరుతో వార్తావాహినినందించిన

పాత్రికేయుడు

మంథిని  రాజకీయరంగానికి బీజమువేయగా

వైద్య,ఆరోగ్య,న్యాయ,సమాచార మంత్రియేగాక  ప్రధానిగా 

జాతిగర్వించదగ్గ  నేతగనిలిచిన కార్తవీర్యుడు

దివాలాదీసే ఆర్థిక వ్యవస్థకు  పునరుజ్జీవంపోసి  సంస్కరణలకు  ఊతమిచ్చిన

ఆర్థికసంస్కరణల పితామహుడు

సమగ్రదృష్టిచేత ఆలోచనా శీలియై అనుపరీక్షలకు అగ్రతాంబూలమిచ్చిన దీర్ఝదర్శి

పలు భాషలలో పాండిత్యమును రాసి మాతృభాషకు పెద్దపీటవేసిన బహుభాషా కోవిదుడు

అంతరాలెంచక అందరితో సత్సంబంధాలునెరిపి

భరతజాతి ఖ్యాతి ఖండాంతరాలకు చాటిన జాతి గర్వించదగ్గ రాజకీయధురంధరుడు

పీవియే తెలుగుజాతికి ఠీవి ఠీవి

అడ్డగూడి ఉమాదేవి, తెలుగు అధ్యాపకురాలు, 9908057980

Related posts

మా పల్లె సంక్రాంతి

Satyam NEWS

తెలుగు భాషామ తల్లి ముద్దు బిడ్డ

Satyam NEWS

అపర చాణుక్యుడు పీవీ

Satyam NEWS

Leave a Comment