36.2 C
Hyderabad
May 14, 2024 15: 56 PM
కవి ప్రపంచం

మహోన్నత వ్యక్తిత్వం

#A Vidyadevi

సీతారామారావు, రుక్మాబాయమ్మల పుత్రుడు 

రంగారావు,రత్నాబాయిల గారాల దత్తపుత్రుడు 

అపార మేధావి ఆలోచనల సహస్రావధాని 

అపర చాణక్యుడు అధికారభాషాసంఘ స్థాపకుడు 

భారతఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన ఘనుడు 

బహుభాషావేత్త అనువాదకుడు కథకుడు

సంస్కర్త నవలారచయిత సంస్కరణశీలి

దేశ ఆర్థిక స్థితిని చక్కదిద్దిన మహనీయుడు 

అంతర్జాతీయ వ్యవహార పరిజ్ఞాని,విఙాని

పరిపాలనా దక్షుడు క్రియాశీలి 

జయ విజయ కలంపేర్లతో రచనలు చేసిన సాహిత్యాభిమాని 

ఉన్నత పదవులు నిర్వహించిన నిరాడంబరుడు

నిజాయితీకి ఆయన మారుపేరు

తెలుగుదనం ఉట్టిపడే ఆహార్యంతో 

ఎందరినో అలరించిన ఆదర్శమూర్తి 

భారతీయ భాషలను కంప్యూటర్ కు అనుగుణంగా మలిచిన రూపశిల్పి

చక్కటి అవగాహనతో వివిధ శాఖలను సమగ్ర దృష్టితో నడిపిన ధీశాలి 

శ్వేత పత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టిన బాధ్యతాయుతుడు,

బహుభాషాకోవిదుడు 

మొదటి ప్రధాని నెహ్రూతో పోల్చదగినవాడు   

బూర్గుల రామకృష్ణారావుతో గురుశిష్య సంబంధం ఎనలేనిది ఎన్నలేనిది 

అట్టడుగు స్థాయి వ్యక్తులతోనూ సత్సంబంధాలను నెలకొల్పి 

చక్కటి సంభాషణలతో పేరు నిలబెట్టుకున్న మార్గదర్శి 

మహోన్నత వ్యక్తిత్వం ఆయనకు భూషణం

ఆయన భాషణం అందరికీ అనుసరణీయం

 అన్ని ప్రాంతాల భాషలకు న్యాయం చేకూర్చిన  ద్రష్ట, స్రష్ట

 తెలుగు బోధనా మాధ్యమానికి అకాడమీలు, బోర్డులను ఏర్పాటు చేసిన విధాత

 ఏకకాలంలో అనేక మందితో స్పందించగలిగిన సమయ స్ఫూర్తి ప్రదాత 

కాకతీయ పత్రికను నెలకొల్పిన పాత్రికేయుడు 

వెయ్యి పడగలను సహస్రఫణ్ గా అనువదించాడు భాషాభిమానంలో  వారికి వారే సాటి

 అందున ఆయనకెవరూ లేరు పోటీ

-డా.ఏ.విద్యాదేవి, చరవాణి:9490300702.

Related posts

సుమసిరి

Satyam NEWS

ఆచార్యుడు, ఆరాధ్యుడు

Satyam NEWS

పురాతన ధర్మం

Satyam NEWS

Leave a Comment