37.2 C
Hyderabad
May 6, 2024 21: 28 PM
Slider కవి ప్రపంచం

తెలుగు భాషామ తల్లి ముద్దు బిడ్డ

#Purimalla Sunanda Khammam

భరతమాత కీర్తి కిరీటంలో కలికితురాయి!

ప్రధాన మంత్రి పదవికే వన్నె తెచ్చిన

దాక్షినాత్యుడు!

ఢిల్లీ పీఠాన్ని అధిష్టించి

తెలుగు వారి ఘనతను ప్రపంచమంతా చాటిన మహా నేత!

పదిహేడు భాషల్లో  అనర్గళంగా మాట్లాడ గలిగిన బహుభాషావేత్త!

స్పానిష్ లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు

ఫెడరల్ కాస్ట్రో అంతటి వారిని అబ్బుర పరిచిన మహా మేధావి!

రాజకీయం లో లౌక్యం ప్రదర్శించి

మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం గట్టెక్కించి

పేరు పొందిన అపర చాణక్యుడు!

అటు రాజకీయం ఇటు సాహిత్యంలో

సవ్యసాచి

వేయి పడగలు నవలను సహస్ర ఫణ్ పేరు తో అనువదించి

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన మహా రచయిత!

గొల్ల రామవ్వ కథతో తెలుగు వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న  మహనీయుడు!

ఇన్ సైడర్ పేరుతో జీవిత ఘట్టాలను చేర్చి నాటి రాజకీయాల లొసుగులను

ఎత్తి చూపిన ధైర్యశాలి!

బాల్యంలోనే ఆనాటి నిజాం నవాబుపై ధ్వజమెత్తిన సాహసి!

న్యాయ వాదిగా బూర్గుల రామకృష్ణారావు ప్రియ శిష్యుడై

జర్నలిస్టు గా కాకతీయ పత్రిక నడిపి

మారుపేరుతో కథలు రాసి అందరికీ అబ్బుర పరిచిన 

అటు రాజకీయం ఇటు సాహిత్యం

రెండు కళ్ళుగా భావించిన

పీవీ నరసింహారావు

ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు!

వురిమళ్ల సునంద, ఖమ్మం

Related posts

ఓటమి భయంతో ఫేక్ సర్వే ఫలితాలు..

Satyam NEWS

కార్పొరేట్లకు ఊడిగం చేసేందుకే వ్యవసాయ బిల్లు

Satyam NEWS

16 వ రోజు సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరాహార దీక్షలు

Satyam NEWS

Leave a Comment