29.2 C
Hyderabad
May 18, 2024 10: 44 AM
Slider నల్గొండ

ఉత్తరాది రైతులకు సంఘీభావంగా ఈ నెల 3వ తేదీన ధర్నా

#SheetalRoshapati

దేశ రాజధాని ఢిల్లీలో విరోచితంగా పోరాడుతున్న రైతులకు, రైతు సంఘాల నాయకులకు విప్లవ అభినందనలు తెలుపుతూ ఈ నెల 3వ, తేదీన జరగబోయే రాస్తారోకోలు, ధర్నాలు రైతులకి సంఘీ భావంగా విజయవంతం చేయాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కార్మికులకు పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని   సిఐటియు కార్యాలయంలో సిఐటియు పట్టణ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో రోషపతి మాట్లాడుతూ గత ఆరు రోజుల నుంచి గజ గజ వణికే చలిలో  వీరోచితంగా పోరాడుతున్నారని, రైతుల విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహారించటం సరైనది కాదని అన్నారు. దీనికి బీజేపీ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

రైతులపై దొంగ చాటుగా తీసుకొచ్చిన మూడు చట్టాల్ని  తక్షణమే ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా భారత దేశ ప్రజలందరూ కార్మిక,ఉద్యోగ, ఉపాధ్యాయులు అందరూ ఈ రైతుల  పోరాటానికి మద్దతు ఇచ్చి  అన్నదాతలు రైతన్నలను కాపాడుకోవాలని కోరారు.

మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, పోరాట మార్గం ఎంచుకొని డిమాండ్లు సాధించే వరకు ఈ ఉద్యమం ఆగదని, వీరోచితంగా పోరాడిన  వారందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ పోరాటం  భారతదేశంలో బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అన్ని వర్గాల కార్మికులకి ఇది శుభసూచకంగా గుర్తుచేశారు.  

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎలక స్వామి గౌడ్, గుండె వెంకన్న, రామకోటి, శ్రీను, కొమ్ము రాములు, వెంకన్న, ఉపేందర్, చింతకాయల పర్వతాలు, కోటమ్మ, దుర్గారావు, మోసంగి శీను, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మోటార్‌స్పోర్ట్ రేసింగ్ టీమ్ సొంతం చేసుకున్న హీరో నాగ చైతన్య

Satyam NEWS

మిస్సింగ్:వేర్ అర్ యూ అఖిలేష్ యాదవ్ ప్లీజ్ టాక్

Satyam NEWS

నాలా పనులను పరిశీలించిన మంత్రి తలసాని

Bhavani

Leave a Comment