24.7 C
Hyderabad
May 19, 2024 00: 04 AM
Slider నెల్లూరు

కోవిడ్ పై అవగాహన: మాస్కులు పంచినవి ఎస్ యు రిజిస్ట్రార్

#vikram university

నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పధకం, నెహ్రూ యువజన కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన కోవిడ్ అవగానా కార్యక్రమలో వి ఎస్ యు రిజిస్ట్రార్ డా. ఎల్ విజయ కృష్ణా రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని వాలంటీర్లకు, ప్రజలకు అవగాహన కల్పించారు.

కె వి ఆర్ సెంటర్ పరిసర ప్రాంతాలలో రోడ్ పైన వెళ్ళుతున్న పాద చారులకు, ద్విచక్రవాహన దారులకు, ప్రక్కన వున్నా దుకాణదారులకు మాస్కులు పంచారు.

తప్పని సరిగా మాస్క్ కు ధరించాలని అదేవిధంగా చేతులను వీలైనన్ని సార్లు సబ్బుతో లేదా శానిటైజర్ లిక్విడ్ తో కడుక్కోవాలని, మొహాన్ని, నోటిని మరియు ముక్కుని చేతులతో తాకడం వీలైనంతగా తగ్గించాలి జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండడం మంచిదని, షేక్ హ్యాండ్ ఇవ్వడం, స్పర్శతో కూడిన ఎటువంటి పలకరింపులైన తగ్గించడం మంచిదని, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సంచరించకుండా జాగ్రత్తలు వహించడం మంచిదని తెలిపారు.

అదేవిధంగా మూడవ వేవ్ కోవిడ్ రాక ముందే ప్రజలు ప్రభుత్వం వారు సూచించిన జాగ్రత్త చర్యలు పాటించాలని కోరారు. ముఖ్యంగా అందరు కొవిడ్ టీకాను తప్పని సరిగా వేయించుకోవాలని విన్నవించారు.

ఈ కార్యక్రమంలో ఎన్ యస్ యస్  సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, నెహ్రూ యువ కేంద్ర యూత్ ఆఫీసర్ డా. ఆకుల మహేంద్ర రెడ్డి, ఎన్ యస్ యస్, ఎన్ వై కె ఎస్ వాలంటీర్లు  పాల్గొన్నారు.

Related posts

హిందూ బంధువులకు “దసరా” శుభాకాంక్షలు…!

Satyam NEWS

నిజమైన నిరుపేదలను గుర్తించేందుకు సాంకేతిక సహకారం

Satyam NEWS

రెండో దశ ఇళ్లను అతి త్వరలో ఇస్తున్నాం

Satyam NEWS

Leave a Comment