38.2 C
Hyderabad
May 5, 2024 19: 58 PM
Slider ఆదిలాబాద్

అనాధ బాలునికి ఆర్థిక సహాయం అందజేసిన స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్

#adilabad police

ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం క్రీడా పాఠశాలలోని జూడో క్రీడలో శిక్షణ పొందుతున్న బాలునికి  పోలీసు స్పెషల్ బ్రాంచ్ శాఖ తరపున రూ.17 వేల నగదు ఆర్థిక సహాయం అందజేసినట్లు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జి. మల్లేష్ పేర్కొన్నారు.

అస్సాం రాష్ట్రం నుండి చిన్నతనంలోనే కొన్ని అనివార్య పరిస్థితుల్లో విడిపోయి మంచిర్యాల జిల్లాలో ఉంటున్న సమయంలో స్థానిక వ్యాయామ ఉపాధ్యాయుల సలహా మేరకు 2016 సంవత్సరంలో ప్రారంభమైన అదిలాబాద్ క్రీడా పాఠశాలలో చేరిన ఎన్.డేంజిల్ పేరుగల బాలుడు గత ఐదు సంవత్సరాలుగా స్థానికంగానే తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలో ఉంటూ జూడో కోచ్ నంగునూరు రాజు దృష్టిని ఆకర్షించడంతో బాలున్ని శిష్యుడుగా చేర్చుకొని గత నాలుగు సంవత్సరాలగా జూడో క్రీడలో శిక్షణ పొందుతూ పలు జాతీయ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నాడు,

శుక్రవారం జూడో శిక్షణ కేంద్రంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జి మల్లేష్, ఎస్సై అన్వర్ ఉల్ హక్, తన అనుచరులతో కలిసి జూడో కోచ్ ఎన్.రాజు సమక్షంలో నగదు ఆర్థిక సహాయం అందజేశారు, స్పెషల్ బ్రాంచ్ అధికారి మల్లేష్ ప్రతిరోజు ఉదయం వ్యాయామం కోసం క్రీడామైదానంలో వస్తుండడంతో పలువురు అనాధ బాలుని వివరాలు వెల్లడించడంతో ఆకర్షితులైన పలువురు దాతలు బాలునికి ఆర్థిక సహాయం అందజేయడానికి ముందుకు వచ్చారు,

ఈనెల 9న స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి పరేశ్ రావరాని రూ. 25 వేల నగదు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది, ఈ క్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జి మల్లేష్ ప్రోత్సాహంతో సభ్యులు అందరూ కలిసి సేకరించిన విరాళం రూ.17 వేల నగదు బాలునికి అందజేశారు, ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మల్లేష్ మాట్లాడుతూ సుదూర ప్రాంతమైన అస్సాం రాష్ట్రం నుండి వచ్చి స్థానికంగానే స్థిరపడిన బాలునికి ఆతిథ్యమిచ్చి ఆదుకుంటున్న తెలంగాణ రాష్ట్ర క్రీడా  పాఠశాల అధికారులు, కోచ్ బృందానికి అభినందనలు తెలియజేశారు,

జూడో క్రీడలో రాణించే అవకాశం ఉన్నందున ఉత్తమ శిక్షణ అందజేసి అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ప్రోత్సహించాలన్నారు, జిల్లాకు క్రీడలో పేరు ప్రతిష్టలు తెచ్చేవిధంగా తీర్చిదిద్దాలని సూచించారు, పలువురు దాతలు ఆర్థిక సాయం కోసం ముందుకు రావాలని కోరారు,

ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్సై అన్వర్ ఉల్ హక్, ఒకటో పట్టణ ఎస్సై జి అప్పారావు, జూడో కోచ్ నంగనూరి రాజు, అథ్లెటిక్ కోచ్ రవీందర్, స్పెషల్ బ్రాంచ్ సభ్యులు ఠాకూర్ అశోక్ సింగ్, జే. సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

బిజెపి లీడర్లపై కేసీఆర్ రివర్స్ కంప్లయింట్

Satyam NEWS

జర్నలిస్టులకు త్వరలోనే కరోనా వ్యాక్సిన్

Satyam NEWS

వాగులో పడి ముగ్గురు విద్యార్థుల మృతి

Satyam NEWS

Leave a Comment