38.7 C
Hyderabad
May 7, 2024 17: 00 PM
Slider ప్రత్యేకం

Hats off: అవయవ దాత కు ఘన సన్మానం

#organ donation

చిన్న వయసులోనే ఇటీవల తన కాలేయాన్ని దానం చేసిన శివ అనే యువకుడికి ఘనంగా సన్మానించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం స్వామి వివేకానంద సేవ బృందం ఆధ్వర్యంలో ప్రపంచ అవయవదాన దినోత్సవం అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రమేష్ చంద్ర మాట్లాడుతూ అవయవ దానం అనేది 1954 సంవత్సరం నుండి ప్రారంభమైందని, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అవయవ  దాతల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఒక వ్యక్తి అవయవాలను ఎనిమిది మందికి ప్రాణదానం చేయవచ్చునని పేర్కొన్నారు.

కళ్ళు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె లివర్, పాంక్రియాస్, చర్మము, ప్రేగులు, కాళ్లు, ముఖము, వంటి అనేక భాగాలు దానం చేయవచ్చునని, బ్రెయిన్ డెడ్ అయిన వారు దానం చేయవచ్చునని అదేవిధంగా బతికున్న వారు లివర్, కిడ్నీ దానం చేయవచ్చునని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జీవన్దాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  అవయవ దానాన్ని చూస్తుందని పేర్కొన్నారు.

కల్వకుర్తి పట్టణంలో శివ అనే యువకుడు ఒక వ్యక్తి కి తన లివర్ను దానం చేసి ప్రాణం నిలబెట్టారని అతను అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.అదేవిధంగా కల్వకుర్తి సీఐ సైదులు మాట్లాడుతూ అవయవ దానం గురించి మూఢ నమ్మకాలు అపోహలు నమ్మొద్దని మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

నిత్యం ఎన్నో ప్రమాదపు కేసులను చూస్తున్నామని  అంగవైకల్యం కలిగిన వారికి అవయవాలు అవసరమని అవయవాల నిలువ చాలా తక్కువగా ఉందని ప్రతి ఒక్కరం సమాజంలో సాటి మనిషికి,కుటుంబానికి ఆపదలో ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ అవయవాలు మరణాంతరం దానంఇవ్వాలనికోరారు. అనంతరం ప్రతి ఒక్కరం మరణాంతర అవయవాలు వృధా చేయబోమని సమాజంలో మరొక ప్రాణానికి ఉపోయోగపడేలా అవయవాలు దానం చేస్తామని

 ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్యం, వైస్ చైర్మన్ షాహిద్,నాయకులు దుర్గా ప్రసాద్, సదానందం గౌడ్,కృష్ణ గౌడ్,రవి గౌడ్,రాఘవేందర్ గౌడ్, నర్సింహ,భోజి రెడ్డి, శ్రీకాంత్,స్కైలాబ్,ఎంపీటీసీ నర్సీ రెడ్డి,సేవా బృందం అధ్యక్షుడు శివ కుమార్,సభ్యులు ఉతేజ్,హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మునిసిపల్ సిబ్బందికి ఆర్ఎంపిల సహకారం

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రంలోని అక్ర‌మ ఆటోల‌పై ట్రాఫిక్ పోలీసులు దృష్టి….!

Satyam NEWS

విదేశాల నుంచి మావోయిస్టు గణపతి ఎప్పుడొచ్చారు?

Satyam NEWS

Leave a Comment