26.2 C
Hyderabad
May 19, 2024 21: 43 PM
Slider ప్రత్యేకం

హత్యా రాజకీయాలతోనే సీఎం అయిన జగన్

#yssunita

వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునితా రెడ్డి రాబోయే ఎన్నికల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తన తండ్రి చావుకు కారణమైన వారు ఓడిపోవడమే లక్ష్యంగా ఆమె కూడా ప్రజల మధ్య తిరుగుతూ ధర్మం వైపు నిలబడాలని అభ్యర్థిస్తున్నారు. వైఎస్ షర్మిలకు పూర్తిగా మద్దతు పలుకుతూ ఆమె గెలుపునకు పని చేస్తున్నారు. మరోవైపు వివేకా హత్య కేసులో సీబీఐ నిందితుడిగా గుర్తించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఓటమి కోసం  ప్రజల్లో బాగా అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం ఆమె ప్రముఖ వార్తా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు.

తాజాగా సునీతా రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాక్రిష్ణతో బిగ్ డిబేట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బిగ్ డిబేట్‌లో సునీతతోపాటు ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కూడా పాల్గొన్నారు. అందులో రాధాక్రిష్ణ అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానం చెప్తూ.. వివేకా హత్య జరిగిన రోజు చోటు చేసుకున్న పరిణామాలను కూడా వివరించారు. తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన విషయం.. తాము ఇంటి నుంచి కడపకు బయలుదేరిన కొద్దిసేపటికి తెలిసిందని అన్నారు. అంటే శంషాబాద్ టోల్ గేట్ వద్ద ఉన్నప్పుడు తన తండ్రి చనిపోయినట్లు తెలిసిందని సునీత వివరించారు.

తాను దారిలో ఉండగానే భౌతిక కాయానికి ఈ రోజే అంత్యక్రియలు చేసేద్దామా? అంటూ పులివెందుల నుంచి వరుసగా ఫోన్ కాల్స్ తనకు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. అలా ఊరికే ఎందుకు కాల్స్ చేస్తున్నారో తనకు అర్థం కాలేదని.. అసలు అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవడం కోసం తాను జగన్ భార్య భారతీకి ఫోన్ చేశానని అన్నారు. అంటే వైఎస్ భారతి పీఏ నవీన్‌కు ఫోన్ చేసి.. భారతీతో మాట్లాడాలని అతనికి చెప్పానని సునీత చెప్పారు. ఆ వెంటనే భారతికి తాను ఫోన్ చేసి.. జగనన్నతో మాట్లాడాలని ఆమెతో చెప్పానని అన్నారు. వెంటనే జగన్‌కు భారతి ఫోన్ ఇచ్చిందని సునీత చెప్పారు.

పులివెందుల నుంచి ఫోన్లు వస్తున్నాయి.. అంత్యక్రియలు ఇప్పుడే చేసేద్దాం అంటున్నారన్న విషయాన్ని జగన్ తో చెప్పా. జగన్‌తో ఆ విషయం చెప్తే.. నీవు ఎలా చేద్దామంటే అలా చేద్దామని నాతో అన్నారు’’ అని సునీత అన్నారు. అప్పటికే వివేకా హత్యకు గురయ్యారని తెలిసినా ఈ విషయాన్ని జగన్‌కు ఎందుకు చెప్పలేదని ఆర్కే ప్రశ్నించారు. కుటుంబానికి ఇక పెద్ద దిక్కు జగనే కదా అని అప్పుడు భావించానని సునీత స్ఫష్టం చేశారు. ఇక ఏమున్నా.. ఆయనే చూసుకుంటాడని ఆ సమయంలో జగన్ ను బాగా నమ్మానని సునీత అన్నారు. అందుకే వివేకా హత్యను సోదరుడు వైఎస్ జగన్ వద్ద ప్రస్తావించలేదని సునీత వెల్లడించారు. తీరా చూస్తే అసలు నిందితులు అవినాష్ రెడ్డే అని సీబీఐ తన విచారణలో గుర్తించిందని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి అవినాష్ రెడ్డికి జగన్ సహకారం అందిస్తూ వెనకేసుకొని వస్తున్నారని అన్నారు. ఇలాంటి హత్యారాజకీయాలు చేసి జగన్ సీఎం అయ్యారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts

దైవ దర్శనానికి వెళ్లివస్తూ ప్రమాదం: ముగ్గురి మృతి

Satyam NEWS

విద్యారంగాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి

Satyam NEWS

ఓవర్ యాక్షన్: కోటప్పకొండలో పోలీసుల తీరుపై అలిగిన ఈవో

Satyam NEWS

Leave a Comment