29.2 C
Hyderabad
May 18, 2024 13: 21 PM
Slider ముఖ్యంశాలు

భారత రాజ్యాంగం పుస్తక ఆవిష్కరణ

#achari

పోటీ పరీక్షల కోసం రచించిన భారత రాజ్యాంగం రాజ్యాంగ అవలోకనం రాజకీయాలు పుస్తక ఆవిష్కరణ మార్కండేయ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో సోమవారం మార్కండేయ ఫంక్షన్ హాల్లో అన్నచెర్ల సురేష్ గౌడ్ రచించిన పుస్తక ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అనే పుస్తకం పోటీ పరీక్షల్లో చదువుకునే వారికే కాకుండా రాజకీయాల్లో ఉన్న వారికి కూడా చాలా ఉపయోగపడుతుందన్నారు.ప్రభుత్వ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉపయోగపడే మంచి పుస్తకం రచించిన సురేష్ గౌడ్ ను అభినందించారు.ఇటువంటి పుస్తకాలు మరెన్నో రచించి ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు.

పుస్తక రచయిత సురేష్ గౌడ్ మాట్లాడుతూ గ్రూప్ పరీక్షల కోసం టెస్ట్ సిరీస్ కల్వకుర్తి కేంద్రంగా ఉచితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, జెడ్పిటిసి భరత్ ప్రసాద్, నల్గొండ ఉమ్మడి జిల్లా విజిలెన్స్ సిఐ చరమందరాజు తదితరులు పాల్గొన్నారు

Related posts

కొల్లాపూర్ లో మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతి వేడుకలు

Satyam NEWS

ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై..!

Bhavani

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎదురు దెబ్బ

Satyam NEWS

Leave a Comment