భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి పండుగ రోజు లాంటిదని కొల్లాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు కాకి సత్యనారాయణ గౌడ్ అన్నారు. బుధవారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి, కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఎల్లేని సుధాకర్ రావు ఆదేశాల మేరకు కాకి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షత న దివంగత నేత దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి 95వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
ముందుగా కాకి సత్యనారాయణ గౌడ్ వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. భారతీయ జనతాపార్టీ కి ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు. దేశ అభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. వాజ్ పేయి జయంతి భారతీయ జనతా పార్టీకి పండుగ రోజు అన్నారు. వాజ్ పేయి ఆశయాలను ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా నెరవేరుస్తున్నారన్నారు.

రాబోయే పురపాలక ఎన్నికలో ఎల్లేని సుధాకర్ రావ్ అధ్యక్షత న పార్టీని విజయం దిశగా నడిపిస్తామని అన్నారు. అనంతరం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి, వృద్ధాశ్రమంలో పాలు, బ్రెడ్, పండ్లు అందజేశారు. వృద్ధులకు వాజ్ పేయి గొప్పతనాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సాయి కృష్ణ గౌడ్, మండల ప్రతినిధి సాయి ప్రకాష్ యాదవ్, రమేష్ రాథోడ్,పిన్ని శెట్టి శివ, కురుమూర్తి, సాయి కృష్ణ, శివకుమార్, వంశీ, ఎల్లయ్య యాదవ్, శివకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.