విజయవాడలోని అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేదిక కల్యాణ మండపం వద్ద కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం తెదేపా అధినేత చంద్రబాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు ఐకాస నేతలు బస్సు యాత్రను ప్రారంభించేందుకు పాదయాత్రగా బయల్దేరగా.. పోలీసులు అక్కడ భారీగా మోహరించి వారిని అడ్డుకున్నారు.
దీంతో చంద్రబాబు సహా నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడితే పోలీసులు ఏమీ చేయలేరన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అరెస్టులతో తమను ఆపలేరన్నారు. అనంతరం చంద్రబాబుతో పాటు ఇతర నేతలంతా బెంజిసర్కిల్ వద్ద రోడ్డుపైనే భైఠాయించారు. పోలీసులు వారితో చర్చలు జరుపుతున్నారు.

ని అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేదిక కల్యాణ మండపం వద్ద కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం తెదేపా అధినేత చంద్రబాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు ఐకాస నేతలు బస్సు యాత్రను ప్రారంభించేందుకు పాదయాత్రగా బయల్దేరగా.. పోలీసులు అక్కడ భారీగా మోహరించి వారిని అడ్డుకున్నారు.
దీంతో చంద్రబాబు సహా నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడితే పోలీసులు ఏమీ చేయలేరన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అరెస్టులతో తమను ఆపలేరన్నారు. అనంతరం చంద్రబాబుతో పాటు ఇతర నేతలంతా బెంజిసర్కిల్ వద్ద రోడ్డుపైనే భైఠాయించారు. పోలీసులు వారితో చర్చలు జరుపుతున్నారు.చంద్రబాబు సహా తెదేపా, అమరావతి పరిరక్షణ సమితి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అశోక్‌బాబులను పోలీసు వాహనంలోనే తరలించారు. అయితే ఎక్కడికి తరలించనున్నారనే విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు.ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అమరావతి ఐకాస నేతల బస్సుయాత్రకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని ప్రశ్నించారు. తాము చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని ఎందుకీ దౌర్జన్యమని పోలీసులను నిలదీశారు.

ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేసుకోవాలని.. పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. అణచివేతతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. శాంతియుతంగానే తాము నిరసన తెలుపుతున్నామని.. ఏ చట్టం ప్రకారం తమను అడ్డుకుంటున్నారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పోలీసులు మాత్రం ఐకాస బస్సుయాత్రకు అనుమతి లేదని తేల్చి చెబుతున్నారు. ఆందోళన తీవ్రతరం కావడంతో చంద్రబాబు సహా ఐకాస నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చంద్రబాబుకు మద్దతుగా సమీప ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సీఎం జగన్‌కు, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అక్కడి చేరుకున్న ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు డ్రోన్ సహాయంతో పోలీసులు ఆందోళన దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఆందోళనలతో బెంజి సర్కిల్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.