39.2 C
Hyderabad
May 3, 2024 11: 53 AM
Slider ప్రపంచం

ప్రపంచంలో నిజాయతీ కలిగిన నగరాల లిస్టులో ముంబై..

ప్రపంచంలో నిజాయతీ గల నగరం అనే అంశంపై రీడర్స్ డైజెస్ట్ ఓ సామాజిక ప్రయోగం చేసింది. ఈ లిస్టులో మన దేశంలోని ముంబై రెండో స్థానాన్ని దక్కించుకుంది. తొలుత ప్రపంచవ్యాప్తంగా 16 నగరాలు ఎంచుకున్నారు. ఒక్కో నగరంలోనూ 12 వాలెట్లు అక్కడక్కడ వదిలివేశారు.

ఈ వాలెట్లలో ఓ ఏభై డాలర్ల విలువైన స్థానిక కరెన్సీ, వ్యాపారానికి సంబంధించిన కార్డులు, గిఫ్ట్ కూపన్లు.. మొబైల్ నెంబర్, వారి కుటుంబ ఫోటోలను ఉంచారు. కొంత వ్యవధి తరువాత ఏ నగరంలో ఎన్ని వాలెట్లు వెనక్కి తిరిగి వచ్చాయనేది పరిశీలించారు. అంటే, ఈ వాలెట్లు దొరికిన వారు అందులోని ఫోన్ నెంబర్.. కార్డుల్లోని ఎడ్రస్ ఆధారంగా వాలెట్ ఎవరిదీ అని తెలుసుకుని అప్పగిస్తారా? లేదా అనేది కొలమానం అన్నమాట.

ఈ లెక్కలో ఫిన్లాండ్ దేశానికి చెందినా హెల్సింకి టాప్ ర్యాంక్ కొట్టేసింది. అక్కడ వీరు వదిలిపెట్టేసిన 12 వాలెట్లలో 11 తిరిగి వారి వద్దకు చేరిపోయాయి. ఇక మన ఆర్ధిక రాజధాని ముంబయిలో 9 వాలెట్లు వెనక్కి వచ్చేయడంతో రెండో స్థానంలో నిలిచింది. ఇక చివరి స్థానంలో పోర్చుగల్ కు చెందిన లిస్బన్ నిలిచింది. ఇక్కడ వదిలేసిన వాలెట్లలో ఒకే ఒక్క వాలెట్ వెనక్కి తిరిగి వచ్చింది.

Related posts

రాత్రి పూట విజయనగరం లో…అదీ నాయుడు ఫంక్షన్ హాల్ వద్ద…!

Satyam NEWS

క‌ర్ఫ్యూ లో రోడ్ల‌పైకి ఏంటీ? ఎస్పీ సూచ‌న‌ల‌తో జ‌రిమానాలు

Satyam NEWS

ఓ మై గాడ్: పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment