30.2 C
Hyderabad
May 17, 2024 14: 55 PM
Slider చిత్తూరు

తిరుపతిలో జాతీయ పర్యాటక ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలి

#MP Gurumurthy

తిరుపతి ఎంపీ గురుమూర్తి నేడు ఢిల్లీలో కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు ఈ సందర్భంగా తిరుపతి ప్రాంతం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ ఆలయ నగరమని రోజుకు లక్షా అరవై వేల మంది పర్యాటకులు, సంవత్సరానికి 5.8 కోట్ల మంది యాత్రికులు పర్యటించే నగరమని, రాష్ట్రంల అత్యధిక పర్యాటకులు పర్యటించే ప్రాంతమని తిరుపతి పర్యాటకులకు అన్ని రకాల రవాణా సౌకర్యాలను అందించడానికి రోడ్డు, రైలు మరియు విమాన కనెక్టివిటీని కలిగి ఉందని ఆయనకీ వివరించారు.

ట్రావెల్ అండ్ టూరిజం అనేది భారతదేశంలోని అతిపెద్ద సేవా పరిశ్రమ అని పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం మరియు ప్రోత్సహించడం, తిరుపతి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించడం, ఇప్పటికే ఉన్న పర్యాటక కార్యకలాపాలను మెరుగుపరచడం మరియు విస్తరించడం, ఉపాధి కల్పన మరియు ఆర్థిక వృద్ధిని మెరుగుపరచడం వంటి కార్యకలాపాలు ప్రోత్సహించేందుకు తిరుపతిలో జాతీయ పర్యాటక ప్రాంతీయ కార్యాలయం ఉండటం ముఖ్యమని తిరుపతిలో జాతీయ పర్యాటక ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా గౌరవనీయులైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని అభ్యర్ధించారు.

అలాగే చాలా మంది భక్తుల, సందర్శకుల నుండి వచ్చిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క రక్షణలో ఉన్న ప్రసిద్ధి చెందిన శివాలయం గుడిమల్లం, ఆచార ప్రయోజనాల కోసం సాయంత్రం 8 గంటల వరకు తెరిచి ఉంచవలసినదిగా కోరడం జరిగింది. భారత ప్రభుత్వం ద్వారా ఇతర దేశాల నుండి వెలికితీసిన పురాతన వస్తువులు పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా వద్ద ఉండటం చాలా సంతోషకరం కానీ ఆంధ్రప్రదేశ్కు చెందిన పురాతన వస్తువులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రపరచడానికి మరియు ప్రదర్శించడానికి చర్యలు తీసుకోవలసినదిగా కోరడం జరిగింది. సూళ్లూరుపేట పరిధిలోని బౌద్ధుల కాలం నాటి కీలక ఆధారాల దృష్ట్యా, కుంతూరు త్రవ్వకాల కోసం కోస్తా బౌద్ధ క్షేత్రాన్ని ‘ప్రాజెక్ట్ మౌసం’ కింద భారత పురావస్తు శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ప్రభుత్వం తక్షణమే చేపట్టవలెనని కోరడం జరిగినది.

అమరావతి సర్కిల్, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లోని మల్లయ్యగారి పల్లి, పిడికిటిమల, ఎగువకణతల చెరువు, కదిరిరాయని చెరువు, ఇరలబండ మొదలైన సాంస్కృతిక కాలాల ప్రత్యేక లక్షణాలతో కూడిన పూర్వ చరిత్ర మరియు బృహత్కాల ప్రదేశాలను అన్వేషణలు చేపట్టి పరిరక్షించాలని కూడా కోరడం జరిగినది. పురాతన వ్రాతప్రతులు గణనీయమైన శాస్త్రీయ, చారిత్రక మరియు సౌందర్య విలువలను కలిగి ఉన్నాయని, ప్రాథమికంగా వైద్యం, వేదాలు, శాస్త్రాలు భారతీయ కళలు, సంస్కృతి మరియు వారసత్వం గురించి సమాచారాన్ని ఇస్తాయని పేలవమైన నిర్వహణ మరియు దండయాత్రల సమయాలలో అనేక తాళ పత్రాలు పోయాయని ప్రస్తుతం ఉన్న రాతప్రతులు వాతావరణ మార్పులు మరియు చెదలు కారణంగా పూర్తిగా పనికి రాని స్థితిలో ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

తిరుపతిలోని విద్యా సంస్థలలో, వివిధ పత్రికల నుండి దాదాపు యాభై అయిదు వేల తాళ పత్ర గ్రంధాలు ఉన్నాయని మరియు ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన జిల్లాల్లో సుమారు లక్ష రాతప్రతులు అందుబాటులో ఉన్నాయి. తాళ పత్రాల పరిరక్షణ చాలా అవసరమని మరియు భవిష్యత్ తరానికి వాటిని డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉందని అందుకు తగిన చర్యలు తీసుకోవలసినదిగా కోరడమైనది. ఈ విన్నపాలని స్వీకరించిన కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి తగు చర్యలు తీసుకొంటామని చెప్పారని తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలియజేసారు.

Related posts

మహాయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న

Bhavani

క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై మేకపాటి స్పందన

Satyam NEWS

కానుక తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment