33.2 C
Hyderabad
May 3, 2024 23: 08 PM
Slider విజయనగరం

విజయనగరం దండుమారమ్మ టెంపుల్ అన్న సమారాధన

#spdepika

విజయనగరం జిల్లా ఆర్మడ్ రిజర్వ్ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ దండుమారమ్మ టెంపుల్ ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన అన్న సమారాధనలో వచ్చిన సాధువులకు స్వయంగా వడ్డించారు…. పోలీస్ బాస్. విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ దేవీ దండుమారమ్మ ఆలయం వద్ద ఘనంగా అన్నసమారాధన కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ  ఎం.దీపిక ముఖ్య అతిథిగా హాజరై, అమ్మవార్కి ప్రత్యేక పూజలు నిర్వహించి, సాధువులకు, భక్తులకు భోజనాలును వడ్డించారు.

అనంతరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఆలయ కమిటీ సభ్యులు మరియు ఇతర పోలీసు అధికారులు అమ్మవారి ప్రసాదాలను స్వీకరించారు. ఇటీవల అమ్మవారి పండుగ మహెూత్సవాలను ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్ 16 వరకు జిల్లా పోలీసుశాఖ ఘనంగా నిర్వహించింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని, అమ్మవారి ప్రసాదాలను స్వీకరించారు. పలువురు భక్తులు అమ్మవారి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని తమ వంతుగా సహాయ, సహకారాలను అందించడంతోపాటు, స్వచ్ఛందంగా సేవలను అందించి తమ భక్తిని చాటుకున్నారు.

ఈ మహెూత్సవ ముగింపు వేడుకల్లో జిల్లా ఏఆర్ డిఎస్పీ యూనివర్స్, ఆర్ఎస్ఐలు ఎన్.గోపాల నాయుడు, రమేష్, ఆలయ కమిటీ సభ్యులు తాతరాజు, రవీశ్వరుడు వాసు, శివ, లక్ష్మణ్, వాసు, శ్రీనివాసరావు, బోనంగి నాయుడు,బంగారి నాయుడు, బలరాం, మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు అవ‌గాహ‌న‌

Sub Editor

గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ఎం.వి రావు పౌండేషన్ లక్ష్యం

Satyam NEWS

(Over The Counter) Is There Anywhere To Buy Hemp Cbd Flower In Pa Hemp Derived Cbd Laws California Medical Benefits Of Hemp Cbd Oil

Bhavani

Leave a Comment