25.7 C
Hyderabad
May 19, 2024 02: 44 AM
Slider ఖమ్మం

నగరాభివృద్దిలో భాగంగానే నిధులు మంజూరు

#Minister Puvvada Ajay Kumar

ఖమ్మం నగరంలో చేపట్టనున్న పలు అభివృద్ది పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.27వ డివిజన్ శ్రీనివాస నగర్ నందు రూ.50 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.56వ డివిజన్ విజయ్ నగర్ కాలని లో రూ.90 లక్షలతో నిర్మించనున్న CC డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.6వ డివిజన్ ప్రశాంతి నగర్ లో రూ.90 లక్షలతో నిర్మించనున్న CC డ్రెయిన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రశాంతి నగర్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ముఖ ద్వారం అర్చ్ నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో డివిజన్లలో విస్తరిస్తున్న ప్రాంతాల్లో కొత్త రోడ్లు, కొత్త డ్రెయిన్లు, వీధి దీపాలు, త్రాగునీరు ఇలా ప్రజల కోసం అనేక సదుపాయాలు ఎర్పాటు చేస్తున్నామని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నుండి అనేక ప్రత్యేక నిధులు తెచ్చుకుని నగరాన్ని సుందరంగా మార్చమని, ముఖ్యంగా సిసి రోడ్లు, సీసీ డ్రెయిన్ల పై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.

ప్రజల భాగస్వాములతో అభివృద్ది చేస్తే బాగా అభివృద్ది జరుగుతుంది అని బలంగా నమ్మేవాడిని కాబట్టే ఖమ్మం ఇంతటి నగరాభివృద్ది సాధ్యమైందన్నారు. నగరాభివృద్ధి కోసం ఎంతో నిబద్దతతో పని చేశామని, ప్రతి డివిజన్ లో పూర్తిస్థాయిలో ఇంటింటికీ మంచినీళ్లు, మట్టి రోడ్లు లేని రోడ్లు. నేను ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగే, ఖమ్మం నగర ప్రజల్ని నాకు కుటుంబ సభ్యులుగా నాకు ఇచ్చిన అస్థి అని పేర్కొన్నారు.నగర ప్రజలకు అవసరమయ్యే పార్కులు, లకారం ట్యాంక్ బండ్, రహదారి విస్తరణ లు, ఓపెన్ జిమ్ లు, పబ్లిక్ టాయిలెట్స్ ఇలా అనేక పనులు చేశామన్నారు.


మళ్ళీ నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఇప్పుడున్న దానికి రెండు రెట్లు మరింత అభివృద్ది చేసి చూపిస్తామని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఅర్ ఇచ్చిన రూ.50 కోట్లతో ప్రతి డివిజన్ లో దాదాపు రూ.90 లక్షలు కేవలం డ్రెయిన్లు మంజూరు చేసి పనులు మొదలుపెట్టడం జరిగిందని దాదాపు 180 కిలోమీటర్ల డ్రెయిన్లు నిర్మిస్తున్నామని అన్నారు.

mఇలా అనేక పనులు చేసి ప్రజల కోసం, వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందని, ఇలా అనేక కొత్త కొత్త ఆలోచనలు నా మదిలో ఉన్నాయని వాటన్నిటిని ఖమ్మంలో అమలు చేయాలని నా అభిమతమని అందుకే BRS ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం మనపై ఉందన్నారు.

Related posts

ఘనంగా శ్రీ గోదా రంగనాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం

Satyam NEWS

కొల్లాపూర్ లో నాటు సారా స్థావరాలపై ఎడతెరిపిలేని దాడులు

Satyam NEWS

రాజ్యాంగ గర్జన వాల్ పోస్టర్ విడుదల

Satyam NEWS

Leave a Comment