24.7 C
Hyderabad
May 18, 2024 22: 51 PM
Slider ముఖ్యంశాలు

అధికారుల్లా డబ్బు వసూలు చేసిన విలేకరులు

#arrest

సేల్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అని అక్రమ వసూళ్లకు పాల్పడిన విలేకరులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించడం జరిగిందని ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. డిఎస్పీ కథనం ప్రకారం.. పెర్కిట్ గ్రామానికి చెందిన నిఖిల్ గురువారం రాత్రి 1 గంటలకు   హైదరాబాద్ నుండి పెర్కిట్ కి అతని అశోక్ లైలాండ్ గూడ్స్ వాహనం సామాను తీసుకొని వెళ్తుండగా సదాశివనగర్ మండలం మల్లుపేట్ వద్దకు రాగానే ఎన్‌హెచ్-44 పై గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు కారులో వచ్చి వాహనాన్ని ఆపారు.

సేల్స్ టాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళమని చెప్పి వాహనంలో గల గూడ్స్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించమని అడిగి 25 వేల రూపాయలు డిమాండు చేశారు. అడిగిన డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించి అతని వద్ద నుండి 3 వేల నగదును బలవంతంగా లాక్కున్నారు. దాంతో బాధితుడు శుక్రవారం సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితులను పట్టుకుని వారి వద్ద నుండి ఒక కారు, ఆరు మొబైల్ ఫోన్స్, నగదు సీజ్ చేసి రిమాండుకు తరలించడం జరుగిందని డిఎస్పీ తెలిపారు.

రిమాండుకు తరలించిన వారిలో కామారెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన చెన్నమగారి మహేశ్ గౌడ్(విజన్ ఆంధ్ర రిపోర్టర్), పాల్వంచ మండల కేంద్రానికి చెందిన కమ్మరి దత్తాద్రి @దత్తు (24 ప్రెస్ రిపోర్టర్) రాజంపేట మండల కేంద్రానికి చెందిన బత్తుల రాజేంధర్(న్యూస్ బూమ్ రిపోర్టర్), తాడ్వాయి మండలం నందివాడ గ్రామానికి చెందిన వేల్పుగొండ ప్రశాంత్ (MR బూమ్ రిపోర్టర్) ఉన్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డిఎస్పి మాట్లాడుతూ.. ఎవరైనా ఇటువంటి నేరాలకు పాల్పడితే వారిని అరెస్టు చెసి సాక్షదారాలతో కోర్టులో శిక్ష పడేలా చేస్తామని తెలిపారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోకపోతే ప్రజాగ్రహం తప్పదు

Satyam NEWS

సంతాపం: జన నాయకుడికి అశ్రునివాళి

Satyam NEWS

సి ఐ టి యు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా మేడే

Satyam NEWS

Leave a Comment