31.2 C
Hyderabad
May 18, 2024 17: 17 PM
Slider వరంగల్

పెత్తందారీ వ్యవస్థపై పోరాడిన విప్లవ వీరుడు సర్వాయి పాపన్న

#MuluguLaibrary

ములుగు జిల్లా కేంద్రంలో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కమిటి ఆధ్వర్యంలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవిగౌడ్, గౌడ సంఘాల సమన్వయ కమిటీ రాష్ట వైస్ చైర్మన్ కారుపోతుల యాదగిరి గౌడ్ మాట్లాడుతూ మెఘల్ చక్రవర్తి పాలనకు వ్యతిరేకంగా అణగారిన వర్గాలను ఏకం చేసిన వ్యక్తి పాపన్న అని అన్నారు.

పాపన్నగౌడ్ స్పూర్తితో గీత కార్మికులు పొరాటలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లా కేంద్రంలో  నీరా ప్రాజెక్టు ఏర్పాటు చేసి గీత కార్మికులకు ఉపాధి కల్పించాలని అన్నారు.

తాటి కల్లులో ఉన్న పోషకాలను ప్రభుత్వమే ప్రచారం చేయాలని వారన్నారు. ప్రమాదాలు జరగకుండా తాళ్ళు ఎక్కే మిషన్లు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వివిధ గౌడ సంఘాల జిల్లా నాయకులు మునిగలా రాజుగౌడ్  జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజల భిక్షపతి గౌడ్  బోమ్మెర శ్రీనుగౌడ్  సురేషగౌడ్  దేవేందర్ గౌడ్ అమరెందర్ గౌడ్ పాల్గొన్నారు.

Related posts

కేంద్ర, రాష్ట్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం

Murali Krishna

కమల్ హసన్ పై కేసు నమోదు

Satyam NEWS

*సెప్టెంబర్ 18నుండి గిరిజన జాతీయ సభలు

Bhavani

Leave a Comment