30.7 C
Hyderabad
May 5, 2024 04: 18 AM
Slider గుంటూరు

ఏపికి పట్టిన కుల వైరస్ కరోనా కన్నా చెడ్డది

#Dr.Chadalawada

విజయవాడ రమేశ్ ఆసుపత్రి చైర్మన్ కుటుంబాన్ని, అందులో పెట్టుబడులు పెట్టిన వారిని విచారణ పేరుతో వేధిస్తున్నారని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు.

డాక్టర్లని, దళితుల్ని, సామాన్యుల్ని వేధించడానికి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆయన అన్నారు. డాక్టర్ రమేశ్ బాబుగా రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమైన వ్యక్తి, ఈ రాష్ట్ర  ప్రభుత్వానికి మాత్రం రమేశ్ చౌదరిగా కనిపిస్తున్నాడని ఆయన అన్నారు.

కుల పిచ్చి పట్టిన రాష్ట్ర ప్రభుత్వం

కోస్తా జిల్లాల్లో  దాదాపు 32 సంవత్సరాల నుంచి 2 వేల మంది సిబ్బందితో రమేశ్ ఆసుపత్రి వైద్య సేవలందిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కుల పిచ్చి పట్టుకున్నదని మొన్న నిమ్మగడ్డ రమేష్ చౌదరి అన్నారు, నేడు డాక్టర్ రమేష్ చౌదరి అంటున్నారు అని ఆయన అన్నారు.

రాష్ట్ర పోలీసులు హైదరాబాద్ లోని రమేశ్ ఇంటికి వెళ్లి, 86 ఏళ్ల వృద్ధురాలి పై విచారణ పేరుతో వీరంగం చేశారని, అచ్చెన్నాయుడికి వైద్యం చేశారని రమేశ్ బాబు పై ప్రభుత్వం కక్ష కట్టిందా లేక ఆయన చంద్రబాబు నాయుడితో కోవిడ్ పై మాట్లాడారనా? అని ఆయన ప్రశ్నించారు.

స్వర్ణప్యాలెస్ ను క్వారంటైన్ కేంద్రంగా ప్రభుత్వమే నిర్వహించినప్పుడు, అందులో ఫైర్, ఇతరరేతర వసతులున్నాయో లేదో ప్రభుత్వానికి తెలియదా? అని అరవిందబాబు ప్రశ్నించారు. అనుమతులిచ్చిన యంత్రాంగాన్ని, హోటల్ తో ఒప్పందం చేసుకున్న వారిని ఎందుకు విచారించలేదు?

అయినా ప్రైవేట్ హాస్పిటల్స్ కి అనుమతి ఇచ్చిన  ప్రభుత్వం కరోనా వైరస్ ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు ఎందుకు ప్రకటించలేదు? అని ఆయన ప్రశ్నించారు. కంప్యూటర్ హార్ట్ డిస్క్ మాయమైందని చెబుతున్నవారు, దాన్ని బయటపెడితే వాస్తవాలు తెలుస్తాయి.

వైద్యులను, వారి కుటుంబసభ్యులను, బంధువులను, పెట్టుబడిదారులను, అందరినీ బెదిరిస్తారా? వైసీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు పక్క రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు వెళుతుంటే,  ప్రభుత్వం ఇక్కడున్న ఆసుపత్రుల్ని కక్షసాధింపు చర్యలతో మూసేయిస్తోంది. సామాన్యులకు వైద్యం అందక చనిపోతున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. కరోనా వైరస్ కన్నా కులవైరస్ అనే పెద్ద జబ్బు రాష్ట్రంలో నడుస్తోందని అరవింద బాబు అన్నారు.

Related posts

మావుళ్ళమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు

Satyam NEWS

ఛీటింగ్ కేసుల్లో ప్రణాళికాబద్ధంగా దర్యాప్తు పూర్తి చేయాలి

Satyam NEWS

లాజిక్కులు లేని ‘‘విశాఖపట్నం కథలు’’

Bhavani

Leave a Comment