40.2 C
Hyderabad
April 29, 2024 15: 29 PM
Slider ఖమ్మం

*సెప్టెంబర్ 18నుండి గిరిజన జాతీయ సభలు

#Tribal National Sabhas

దేశవ్యాప్తంగా గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసి అధికార రాష్ట్రీయ మoచ్( ఏఏఆర్యు) జాతీయ నాలుగో మహాసభలు తమిళనాడు రాష్ట్రంలో సెప్టెంబర్ 18 నుంచి 21 వరకు జరుగుతున్నాయని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య వీరభద్రం తెలిపారు.

తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు బానోతు బాలాజీ అధ్యక్షతన ఖమ్మం సంఘం జిల్లా కార్యాలయంలో జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా గిరిజన అభివృద్ధికి ఐటిడిఎ ను వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల ముందు ఐటిడి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయలేదని గుర్తు చేశారు.

పెండింగ్లో ఉన్న పోడు రైతుల దరఖాస్తులు పరిశీలించి హక్కు పత్రాలు కల్పించాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో విద్యా వైద్యం అభివృద్ధికి ప్రత్యేక కృషి కొనసాగించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. జాతీయ మహాసభల జయ ప్రధానికి అందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా నాయకులు మూడ్ గన్యా నాయక్, బాధావత్ శ్రీనివాస్ భూక్యా కృష్ణ నాయక్, భూక్యా విజయ, అజ్మీర శోభన్ నాయక్ హలావత్ నరసింహారావు, రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి: సర్వ లోకాల సృష్టికర్త విశ్వకర్మ

Satyam NEWS

తెలంగాణ వాదనను ప్రపంచానికి చాటిన ప్రో. జయశంకర్

Satyam NEWS

ఉప్పల్లో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభం

Satyam NEWS

Leave a Comment