30.2 C
Hyderabad
May 17, 2024 14: 51 PM
Slider శ్రీకాకుళం

స్టార్ వాకర్స్ క్లబ్ నూతన కార్యవర్గం….ఏకగ్రీవ ఎంపిక

#StarWalkerClub

నిస్వార్థ సేవలకు చిరునామా గా నిలుస్తూ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉత్తమ వాకర్స్ క్లబ్ గా పేరుగాంచిన శ్రీకాకుళం స్టార్ వాకర్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

2021..22 సంవత్సరాల కు గాను ఈ నూతన కార్యవర్గం పనిచేస్తుంది.. అధ్యక్షునిగా సి.హెచ్.సూర్యారావు, ప్రధాన కార్యదర్శి గా జి.నారాయణరావు,ఉపాధ్యక్షునిగా ఆర్జి వెంకట రమణ, జాయింట్ సెక్రటరీ గోలీ సంతోష్ కుమార్,కోశాధికారి గా గొర్లి వాసుదేవరావు, జాలీ వాకర్ గా ఎం.మల్లిబాబు ,వాకర్స్ క్లబ్ కో.ఆర్డినేటర్ గా శాసపు జోగినాయుడు ,క్లబ్ గౌరవ అధ్యక్షునిగా గురు ఆనందరావు లను ఎన్నికున్నారు.

నూతన కమిటీకి విశాఖపట్నం నుండి ముఖ్యఅతిథిగా హాజరైన వాకర్స్ ఏరియా అధ్యక్షుడు కళ్ళేపల్లి  వెంకట గౌరపతిరావు  సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది.

నూతన కమిటీకి అతిధులు సత్కరించారు..ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ కె. పాండురంగారావు, లాడి వాసుదేవరావు, అంధవరపు రవికుమార్ ,ఐ. కె.రావు,పి.జి.గుప్తా  ,బి.వి.రవిశంకర్. ఐ. శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఒంగోలు సభ చూసి డిప్రెషన్ లోకి వెళ్లొద్దు

Satyam NEWS

సంచలనం సృష్టించిన చదలవాడ కృష్ణమూర్తి అత్తగారి కిడ్నాప్

Satyam NEWS

కొత్త జిల్లాలు… మళ్లీ కొత్త ఎజెండా…

Satyam NEWS

Leave a Comment