Slider చిత్తూరు

సంచలనం సృష్టించిన చదలవాడ కృష్ణమూర్తి అత్తగారి కిడ్నాప్

#ChadalawadaKrishnamurthy

తిరుపతి లోని కృష్ణ తేజ విద్యాసంస్థల చైర్ పర్సన్ చదలవాడ సుచరిత తల్లి పద్మావతమ్మను కొందరు వ్యక్తులు  కిడ్నాప్ చేసిన సంఘటన సంచలనం సృష్టించింది.

పద్మావతమ్మ కిడ్నాప్ విషయం డాక్టర్ చదలవాడ సుచరిత వ్యక్తిగత సెక్యూరిటీ రవీందర్ తిరుచానూరు  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.  

ఆమెను ఎన్.వి. ప్రసాద్ దగ్గర  పనిచేస్తున్న వంశీ, మునెయ్య హేమలత అనే ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారని పోలీసులకు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో చెన్నుపాటి శ్రీ కృష్ణ, ధన కుమార్ రెడ్డి, శెట్టిపల్లి బాల మరో 15 మంది పద్మావతమ్మ ఇంటికొచ్చి ఆమెను ఇంటి నుంచి గెంటి వేశారని, రాత్రంతా పద్మావతమ్మ రోడ్డుపై ఉన్నారని ఫిర్యాదులో తెలిపారు.

చదలవాడ సుచరిత చిత్తూరు జిల్లా సీనియర్ నాయకుడు చదలవాడ కృష్ణమూర్తి రెండవ భార్య. కాగా చదలవాడ కృష్ణమూర్తి మొదటి భార్య పిల్లలు సుమలత,  కవిత, చదలవాడ కృష్ణమూర్తి బావమరిది ఎన్.వి. ప్రసాద్ లతో చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి.

గత కొన్ని నెలలుగా తనను, తన  కుటుంబ సభ్యులను గృహ నిర్బంధంలో పెట్టి, చిత్రహింసలకు గురిచేస్తూ, తనను తన కుటుంబ సభ్యులను మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారని చదలవాడ సుచరిత పలుమార్లు ఫిర్యాదులు చేశారు.

తనను తన కూతుర్ని గృహనిర్బంధంలో పెట్టి, తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని కూడా ఆమె పేర్కొంటున్నారు.

అదేవిధంగా రేణిగుంట ఇండియన్ బ్యాంక్ మిద్దె మీద నివాసముంటున్న తన తల్లిని ఇంట్లో నుంచి బయటికి రాకుండా, తాము ఆ ఇంటికి వెళ్లకుండా, ఇంటికి బయటి నుండి తాళం వేసి వేధిస్తున్నారని కూడా సుచరిత తెలిపారు.

వృద్ధురాలైన తన తల్లికి తిండి నీళ్లు కూడా లేకుండా చేసి వేధిస్తున్నారని సుచరిత పేర్కొన్నారు.

తన తల్లి వ్యక్తిగత సహాయకురాలు ముత్తు ని ఇంటి నుంచి బయటకు పంపించి, శ్రీకృష్ణ, వంశీ, రహమతుల్లా  అనే వ్యక్తులు ఆమెన భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, వారితో తన తల్లికి ప్రాణభయం ఉందని చదలవాడ సుచరిత తిరుచానూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కిడ్నాప్ జరిగిన వెంటనే తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ చేసిన వారు తక్షణమే పద్మావతమ్మను వదిలేశారు. ఆమెను తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో వదిలేసి వెళ్లారు. పోలీసులు సకాలంలో స్పందించి ఆమెను క్షేమంగా ఇంటికి చేర్చారు.

కె.రమాకాంత్

Related posts

ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

Satyam NEWS

స్వాత్రంత్య వేడుకలను 20 నిమిషాల్లో పూర్తి చేయాలి

Satyam NEWS

రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారు పతనం అవుతారు

Satyam NEWS

Leave a Comment