28.7 C
Hyderabad
April 26, 2024 09: 58 AM
Slider ప్రత్యేకం

ఒంగోలు సభ చూసి డిప్రెషన్ లోకి వెళ్లొద్దు

#Raghuramakrishnamraju

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాల్గొన్న ఒంగోలు సభ ను చూసి వైసీపీ పార్టీ శ్రేణులు డిప్రెషన్ లోకి వెళ్ల వద్దని సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నర్సాపూర్ ఎంపి కె. రఘురామకృష్ణం రాజు అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సభలను మరిన్ని చూడవలసి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సభను చూసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గ్రాఫ్ పడిపోతున్నట్లు స్పష్టమవుతుందని చెప్పారు. తన గ్రాఫ్ మాత్రమే బాగున్నదని, ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగాలేదన్న ముఖ్యమంత్రి తన గ్రాఫ్ గురించి కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తాం అంటున్నారని, అయితే ఒకటి ప్లస్ ఏడు ప్లస్ ఐదు కలిపి మొత్తం 13 స్థానాలకు పరిమితం అవుతామేమోనన్న అనుమానాన్ని రఘురామకృష్ణంరాజు వ్యక్తం చేశారు.

అసలు ఎన్నికల ముందు మనం చెప్పింది ఏమిటి, చేస్తున్నది ఏమిటన్న ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. రాజకీయాలలో విమర్శలు సహజమని, ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నేతగా మీరు ఎన్ని విమర్శలు చేయలేదని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని పట్టుకొని రోడ్డుమీదే కాల్చండి, బంగాళాఖాతంలో కలపండి, చెప్పులతో కొట్టండి అని మీరన్నప్పుడు, టిడిపి ప్రభుత్వం ఎన్నిసార్లు 41ఏ నోటీసులను జారీ చేసిందని ప్రశ్నించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి పట్టాభికి 41ఏ కింద నోటీసులు జారీ చేయడం పట్ల ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు విమర్శించకుంటే ముఖ్యమంత్రిని పొగుడుతారా అంటూ ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగినన్ని రోజులు బలహీనపడుతున్న పార్టీ బలోపేతానికి పనిచేస్తానన్న ఆయన, ఈ సభకు మూడు వేలకు మించి ప్రజలు హాజరు కాలేదన్నారు. వరదలు తగ్గినప్పటికీ, సహాయక కార్యక్రమాలు మాత్రం సక్రమంగా జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

వరద బాధితులకు నాలుగు బంగాళాదుంపలు, టమోటోలు, వంకాయలను ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. వరద బాధితుల పట్ల మానవత్వాన్ని ప్రదర్శించాలని సూచించారు. పట్టాభి, మహాసేన రాజేష్ పై ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టాలన్న న్యాయస్థానాలు ఉన్నాయని చెప్పారు.

Related posts

కేసీఆర్ పుణ్యమా అని రోజుకూలిగా మారిన ఆర్టీసీ కార్మికుడు

Satyam NEWS

పిచ్చి ముదిరింది: స్వాతంత్య్ర యోధుల పేరు కూడా హాంఫట్

Satyam NEWS

పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలి: సి పి ఎం

Satyam NEWS

Leave a Comment