30.2 C
Hyderabad
May 17, 2024 17: 44 PM
Slider ఖమ్మం

తెలంగాణ ప్రజా సాహిత్యానికి అధ్యుడు వట్టికోట

#vattikota

తెలంగాణ ప్రజా సాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసిన ఆధ్యుడు వట్టి కోట ఆళ్వార్ స్వామి అని భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ అన్నారు. వట్టికోట జయంతిని పురస్కరించుకొని స్థానిక జిల్లా గ్రంధాలయ సంస్థ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రచయితగా, పాత్రికేయు నిగా, ప్రకటన కర్తగా, సేవా శీలిగా, ఉద్యమకర్తగా, కమ్యూనిస్టు నేతగా, ప్రచారకుడిగా, భాషా సాహిత్య వేత్తగా, పౌరహక్కుల నేతగా, అనేక ఉద్యమాలు పాల్గొన్నారని, తెలుగులో రాజకీయ నవలలకు ఆధ్యునిగా ఉన్నారని చెప్పారు. 1915 నవంబర్ ఒకటో తారీఖున నల్గొండ జిల్లా చెరువు మాదారం గ్రామములో జన్మించిన ఆయన అంచలంచెలుగా ఎదిగి తెలంగాణ కీర్తిని చాటారని అన్నారు. గ్రంథాల యోద్యమంతో మొదలైన ప్రేరణ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసే వరకు సాగిందని చెప్పారు. నిజాం ప్రభు ఆగ్రహానికి గురై జైలు జీవితాన్ని కూడా గడిపారన్నారు. జైలు లోపల, ప్రజల మనిషి, కనువిప్పు, అగ్ని ధార లాంటి నవలలను రచించి ప్రజల చేత ఆదరణ పొందాలని చెప్పారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్న వట్టి కోట ఆళ్వారు స్వామి తెలంగాణ వాడు కావడం మన అదృష్టమని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకురాళ్లు డి. వరలక్ష్మి దేవి, జి .మణి మృదుల, విద్యార్థిని విద్యార్థులు పాఠకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

[Over|The|Counter] Penies Enlargement Caferjack Injectible Male Enhancement How Long Do Male Enhancement Pills Stay In Your System

Bhavani

కొండను తవ్వి ఎలుకలు పడుతున్న కాంగ్రెస్ నాయకులు

Satyam NEWS

పారదర్శకంగా కానిస్టేబుల్స్ బదిలీల ప్రక్రియ

Satyam NEWS

Leave a Comment