28.7 C
Hyderabad
May 6, 2024 00: 35 AM
Slider ముఖ్యంశాలు

కొండను తవ్వి ఎలుకలు పడుతున్న కాంగ్రెస్ నాయకులు

#police

వనపర్తిలో  ఎం.ఎల్. ఎ క్యాంప్ కార్యాలయంలో హల్చల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని బిఆర్ఎస్ నేతలు వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం అధికారం శాశ్వతం అని భావించి అవాకులు, చెవాకులు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త అని బి.అర్.ఎస్ నాయకులు హెచ్చరించారు. నిరంజన్ రెడ్డి  క్యాంప్ కార్యాలయంను ఒక దేవాలయంగా భావించి అక్కడికి వచ్చిన ప్రజలకు ఇబ్బంది కలగకుడా దని వారి తల్లిగారు తారకమ్మా పేరిట షేడ్ ఏర్పాటు చేశారన్నారు.

ఓడిన తర్వాత ఆ షెడ్డు తొలగిస్తే తన తల్లికి అవమానం జరగుతుందని తొలగించడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మాత్రమే కట్టిస్తారు అందులో ఫర్నీచర్ ఎవ్వరికీ అనుకూలంగా వారు పెట్టుకుంటారని,ఈ విషయము కూడా తెలియకుండా మాట్లాడడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

నిబంధనలు పాటించిన నిరంజన్ రెడ్డి  మీద కేసు పెట్టమంటారా….నిరాధార ఆరోపణలు చేసిన మీ మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. చేతనైతే ప్రభుత్వం మీది విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి కానీ ఏదో ప్రచారం కోసం మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాజకీయాలలో స్థానికేతరులు చేరి  వనపర్తి రాజకీయాన్ని కలుషితం చేయడాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్స్ కంచె రవి, పుట్టపాకుల మహేష్, నాయకులు పరంజ్యోతి, సూర్యవంశం గిరి, యుగేందర్ రెడ్డి, అణపటి రాము, మంద రామ్, వజ్రాల సాయిబాబా, గంధం ప్రశాంత్, తోట సాయి పాల్గొన్నారు.

రాచాలపై పోలీస్ కు ఫిర్యాదు

వనపర్తిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సందర్శించిన కాంగ్రెస్ నేత రాచాల యుగంధర్ గౌడ్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని కించపరిచి ఆరోపణలు చేసినందుకు కేసు నమోదు చేయాలని బిఆర్ ఎస్. నాయకులు టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులను కించపర్చారని, అధికారుల అనుమతి లేకుండా క్యాంపు కార్యాలయంలోకి యుగంధర్ గౌడ్ వెళ్ళారని వారు తెలిపారు. నాయకులు పలుస రమేష్ గౌడ్, వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, గంధం పరంజ్యోతి, కావలి మధులత, కంచె రవి, కోళ్ల వెంకటేష్ పిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలను ప్రారంభించిన పసుపులేటి పవన్

Satyam NEWS

ఖమ్మం అసెంబ్లీ బరిలోకి పొంగులేటి?

Bhavani

భారత్ బయోటెక్ కోవాక్సిన్ కు పూర్తి స్థాయి అనుమతి

Satyam NEWS

Leave a Comment