25.7 C
Hyderabad
May 19, 2024 09: 44 AM
Slider నల్గొండ

హుజూర్ నగర్ లో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

#Congress Hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు అధ్యక్షతన వైయస్  రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా  పట్టణంలోని ఇందిరా సెంటర్ లోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు, ఐ ఎన్ టి యు సి రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు, మున్సిపల్  కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్ లు మాట్లాడుతూ 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభలో అడుగుపెట్టిన వైయస్సార్ 6 సార్లు పులివెందుల నుండి ఎన్నికై, 4 సార్లు కడప పార్లమెంటరీ నుండి ఎన్నికైన ఏకైక వ్యక్తి అని, జయమే తప్ప అపజయమెరుగని రాజకీయ పులిబిడ్డ అని పేర్కొన్నారు.

1400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని, ప్రజలకు మేలు చేయాలనే వ్యూహరచన చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన ఘనత వై ఎస్ ఆర్ కే దక్కుతుందని అన్నారు. ముఖ్యమంత్రిగా  ప్రజలకు ప్రజా ఉపయోగ పథకాలను ఎన్నింటినో ప్రవేశపెట్టి అమలు చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు.

వైయస్సార్ పేద ప్రజల గుండెల్లో ఆచంద్రార్కం సజీవంగా నిలిచిపోయారని శ్లాఘించారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్, వంటి ప్రజా ఉపయోగకరమైన పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా పై పథకాలు ప్రజలకు అమలుపరిచే విధంగా  సమున్నతమైన పరిపాలన అందించిన ఘనుడని, వైయస్సార్ మన మధ్య లేకపోయినా ఆశయ సాధన కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సుంకరి శివరాం యాదవ్, కోల్లపూడి యోహాన్, ముశం సత్యనారాయణ, కౌన్సిలర్ ములకలపల్లి రామగోపి, వెలిదండ వీరారెడ్డి, కారంగుల వెంకటేశ్వర్లు, వల్లపుదాసు కృష్ణ, బెల్లంకొండ గురవయ్య, మేళ్లచెరువు ముక్కంటి, పోతనబోయిన రామ్మూర్తి, కోలా మట్టయ్య, పోతుల జ్ఞానయ్య, షేక్ సైదా మేస్త్రి, నందిగామ శ్రీను, దొంతగాని జగన్, చెన్నం శ్రీనివాస్, షేక్ రజాక్ బాబా, దాసరి రాములు, భీమిశెట్టి గోపీనాయక్, షేక్ ఉద్దండు పార్టీ కార్యకర్తలు, వైయస్సార్ అభిమానులు పాల్గొన్నారు.

Related posts

సిలిండర్ ధరలు పెంచి కేంద్రం పేదల నడ్డి విరుస్తోంది

Satyam NEWS

ప్రొటెస్టు: ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ లను అమలుచేయనివ్వం

Satyam NEWS

మంత్రి సీతక్కకు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు

Satyam NEWS

Leave a Comment