28.7 C
Hyderabad
May 6, 2024 02: 10 AM
Slider వరంగల్

మంత్రి సీతక్కకు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు

#seetakka

ములుగు జిల్లా కేంద్రంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఉద్యోగుల సంఘం నాయకుల ఆధ్వర్యంలో దనసరి అనసూయ సీతక్కకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా ప్రకటించిన సందర్భంగా ఇజిఎస్ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. అనంతరం సీట్లు పంపిణీ చేశారు. ములుగు లాంటి ఏజెన్సీ జిల్లా నుండి రాష్ట్ర మంత్రిగా పేదల పక్షపాతి దనసరి అనసూయ సీతక్క గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎదిగినందుకు అదే శాఖలో పనిచేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా జాక్ చైర్మన్ మాలోత్ రాజు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో గత 20ఏండ్లుగా చాలీచాలని వేతనాలతో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్, ఏపిఓలు,డిఆర్డిఏ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది,కమిషనర్ ఆఫీసులో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది 12 వేల మంది ఉద్యోగులు సీతక్క నాయకత్వంలో ఉద్యోగాలు మెనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తారని నమ్మకంతో ఉన్నామని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఇంకా ప్రజలకు ఎక్కువ సేవలు చేస్తామని ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రకటన చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసి తరఫున జాక్ చైర్మన్ మాలోత్ రాజు, టెక్నికల్ అసిస్టెంట్ల సంఘం నుండి సురేష్,రామయ్య, కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం నుండి సర్దార్, శ్రీనివాస్,ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నుండి సురేష్,రఘు, భాస్కర్,సమ్మయ్య,మహిళా ఉద్యోగులు కవిత,మంజుల, కళ్యాణి,ఉద్యోగుల సంఘ బాద్యులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ములుగు

Related posts

విజయనగరం టూటౌన్ పీఎస్ ను పరిశీలించిన ఎస్పీ దీపికా…!

Satyam NEWS

బక్రీద్ ప్రార్ధనల్లో పాల్గొన్న అంబర్ పేట్ ఎమ్మెల్యే                      

Satyam NEWS

ఏపి బీజేపీ నుంచి మరో వికెట్ అవుట్: సోమూ ఏ క్యాహై?

Satyam NEWS

Leave a Comment