33.7 C
Hyderabad
April 29, 2024 02: 32 AM
Slider నల్గొండ

కరోనా నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలి

#Archana Ravi

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కరోనా వైరస్ నియంత్రణకు చేపడుతున్న చర్యలకు పట్టణ ప్రజలందరూ సహకరించాలని మునిసిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన రవి కోరారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులలో మాత్రమే ప్రజలు బయటకు రావాలని, మనిషి మనిషికి మూడు నుండి ఆరు అడుగుల భౌతిక దూరాన్ని తప్పక పాటించాలని కోరారు.

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ మాస్కులు తప్పక ధరించాలని అన్నారు. పట్టణంలోని అన్ని వార్డులను మున్సిపల్ సిబ్బందితో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, కరోనా వైరస్ పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ జక్కుల నాగేశ్వరరావు, కమిషనర్ బట్టు నాగిరెడ్డి, షేక్ యాకూబ్ పాషా, మేనేజర్, వార్డు కౌన్సిలర్లు అమర బోయిన సతీష్, వీర్లపాటి గాయత్రీ, భాస్కర్, కస్తాల శ్రవణ్ కుమార్, వెలిదండ సరిత వీరారెడ్డి, బొల్లెందు ధనమ్మ, కారంగుల విజయ గౌడ్, కుంట ఉపేంద్ర సైదులు వివిధ వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Related posts

ప్రియాంక గాంధీని ఇరికించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం

Satyam NEWS

డేంజర్ బెల్స్: దేశంలోకి వచ్చేసిన కరోనా వైరెస్

Satyam NEWS

పోలవరం ఆగుతుందని నేను ముందే చెప్పాను

Satyam NEWS

Leave a Comment