33.7 C
Hyderabad
April 29, 2024 02: 24 AM
Slider కవి ప్రపంచం

మహిమగల తల్లి

#Viswika Secunderabad

జగజ్జనని మహిమగల మహంకాళి

సింహ వాహనమెక్కి కొలువైంది అమ్మ

కోర్కెలను తీర్చేటి కొంగు బంగారము

చూడ కన్నులు చాలని ముగ్ధ సింగారము

వాడవాడలందు అమ్మ రూపమే

వేయికళ్ళతో కాచే దయా స్వరూపమే

అపరశక్తి గల ఆదిశక్తిరూపము

దుష్టులను శిక్షించే కాళికా రూపము

ఆషాఢ మాసాన ఆనవాయితీగా

బోనమెత్తి నిన్ను కొలిచేము

పిల్ల పెద్దలను చల్లంగ చూసి

కలతలన్ని తీర్చు కరుణామయి

కనువిందుగ పోతరాజు విన్యాసాలు

శివసత్తుల నృత్యాలు,కటాల కృత్యాలు

భక్తిభావ తరంగాల అంగరంగ వైభవం

భక్తజన సందోహంతో ఆనంద సౌరభం

విశ్వైక  సికింద్రాబాద్

Related posts

అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి

Satyam NEWS

ఐసోలేషన్ రూల్ మఠాష్: మా సారు దేవుడు కరోనా అంటుకోదు

Satyam NEWS

రవితేజ ఈజ్ బ్యాక్ : టీజర్ తోనే ఆకట్టుకున్న’డిస్కోరాజా’

Satyam NEWS

Leave a Comment