30.2 C
Hyderabad
May 17, 2024 17: 01 PM
Slider ప్రత్యేకం

బూతులు మాత్రమే మాట్లాడే నేతలూ ఈ వీడియో చూడండి

#ashok gajapati raju

అత్యంత అసహ్యకరమైన మాటలతో విమర్శలు చేసే మంత్రులను, ప్రముఖులను చూస్తున్నాం. సాటి రాజకీయ నాయకుడిని అందులోనూ వయసులో పెద్దవారిని కూడా అత్యంత నీచమైన పదజాలంతో సంబోధించే వారినీ చూస్తున్నాం.

రాజకీయాలు అంటేనే జుగుప్స కలిగిన వారు ఒక్క సారి ఈ వీడియో చూడండి. ఇంకా విలువలతో, నోరు జారకుండా మాట్లాడే ఒక నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడు కనిపిస్తారు. ‘‘అత్యంత నిజాయితీపరుడైన వ్యక్తివి నీకు గవర్నర్ పదవి ఇస్తా’’ అని ప్రధాని నరేంద్రమోడీ ఆఫర్ ఇస్తే సున్నితంగా తిరస్కరించి వచ్చిన పూసపాటి అశోక్ గజపతిరాజు మాట్లాడిన వీడియో ఇది.

మాన్సాస్‌, సింహాచ‌లం ట్ర‌స్టుల ఛైర్‌పర్సన్‌ నియామక జీవోను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా అశోక్ గ‌జ‌ప‌తిరాజు మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా చట్టాలు, రాజ్యాంగాన్ని గౌరవించాలని ఆయన సూచించారు.

మాన్సాస్‌, సింహాచలం ట్రస్టులో కొన్ని కొన్ని చోట్ల తిరిగి పూడ్చలేని విధంగా నష్టం జరిగిందని ఆయన అన్నారు. అలాంటి వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఒక విషయాన్ని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.

అక్కడి ప్రతిష్టాత్మక గోశాలలో కొన్ని ఆవులను చిత్ర హింసలు పెట్టి చంపేశారని చెబుతూ అశోక్ గజపతిరాజు భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ఏ తప్పునైనా సరిదిద్దవచ్చు కానీ చనిపోయిన ఆవులను తిరిగి తీసుకురాలేము కదా అని ఆయన చెబుతున్నప్పుడు మీడియాలోని వారు కూడా భావోద్వేగానికి గురయ్యారు.

సింహాచలం ట్రస్టు పరిధిలోని ఆలయాల్లో పరిస్థితులను పరిశీలించాల్సి ఉందని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎంత వరకు సహకరిస్తుందనేది చూడాలన్నారు. రామతీర్థం ఆలయానికి తాను విరాళం ఇస్తే దాన్ని తిప్పి పంపారన్నారు.

తాను ఛైర్మన్‌గా ఉన్నప్పుడు అక్రమాలు జరిగాయని వాదించారని.. ఎలాంటి నష్టం జరిగిందో చెప్పలేకపోయారని అశోక్‌ గజపతి అన్నారు. అధికారులు ఉద్యోగ ధర్మాన్ని పాటించాలని కోరారు. మాన్సాస్‌ ప్రజల కోసం పుట్టిన సంస్థ అని.. తనపై పగతో ఆ కార్యాలయాన్ని తరలించాని ఆక్షేపించారు.

తనను ఇబ్బంది పెట్టేందుకు సామాన్యులు, ఉద్యోగులు, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేశారని ఆయన ఆరోపించారు. ‘‘ట్రస్టు చైర్మన్ తో పాటు సింహాచలం దేవస్థానం చైర్మన్ పదవి నుంచి తొలగించారు. డిస్మిస్  ఆర్డర్ ఇచ్చారు. వాదనలు విన్న తరువాత కోర్టు దాన్ని కొట్టేసింది’’ అని ఆయన అన్నారు.

‘‘ఇప్పటికైనా ప్రభుత్వం చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాలి అని కోరుతున్నాను. కోర్టు తీర్పు పూర్తి పాఠం వొచ్చినాక మిగతా వివరాలు వెల్లడిస్తాను’’ అని అన్నారాయన.

కోర్టులో గెలిచినందుకు విర్ర వీగుతూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, తనను తీసేసిన వారిని తిట్టడం చేయని అశోక్ గజపతిరాజు ఈ తరం రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలి.

Related posts

పేరిణి నృత్యానికి జాతీయ స్థాయి గుర్తింపు రావాలి

Satyam NEWS

వైసీపీ పాలనా వైఫల్యాలపై చర్చకు వస్తావా నానీ?

Satyam NEWS

అట్టహాసంగా ములుగు జడ్పీ చైర్మన్ జగదీశ్వర్  జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment