Slider నల్గొండ

హుజూర్ నగర్ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చి దిద్దుకుందాం

#hujurnagar

మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలని  సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

నేడు జరిగిన హుజూర్ నగర్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండాలని సీఎం కోరుకున్నారని అన్నారు.

మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  నేతృత్వంలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారని తెలిపారు.

సీఎం కేసీఆర్ తో ప్రస్తావించినప్పుడు హుజూర్ నగర్ అభివృద్ధి కొరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మాట ఇచ్చారని,70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలోనే ఎవరూ ఊహించి నటువంటి అనేక సంక్షేమ పథకాలు పట్టణాలు,పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తి కెసిఆర్ అని ఎమ్మెల్యే అన్నారు.

అందులో భాగంగానే పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి, డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు, మొదలైనవి గ్రామాలలో, పట్టణాలలో ఉండాలని,మున్సిపాలిటీలలో మంచి మార్కెట్ ఏరియా ఉండాలని మొట్ట మొదటిసారిగా ఆలోచించిన వ్యక్తి కేసీఆర్  అని అన్నారు.

హుజూర్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు కేసీఆర్  ప్రకటించిన 25 కోట్ల పనులకు టెండర్లు పూర్తి ఇవ్వడం జరిగిందని, త్వరలోనే అన్ని పనులు పూర్తవుతాయని,హుజూర్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాలని కోరారు.

హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో   మున్సిపాలిటీకి విరుద్ధంగా నిర్మించే లేవు అవుట్ స్థలాలను సహించేది లేదని,

హుజూర్ నగర్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేయాలని, దీనికి పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు.

ఒకప్పటి హుజూర్ నగర్ కంటె ఇప్పటి హుజూర్ నగర్ కొంత వరకు అభివృద్ధి పదంలో ఉందని,ఎమ్మెల్యే,ఎంపీ పంచాయతీ,నిధులను మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు,పంచాయతీ అభివృద్ధి కొరకు వినియోగించుకునే విధంగా ఉండాలని,గ్రామాలలో కూడా చాలామంది సర్పంచులకు తెలియజేసిన విషయం పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని, అదే విధంగా పని చేయడం జరిగిందని అన్నారు.

పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఏ నియోజకవర్గానికి ఇవ్వని నిధులు హుజూర్ నగర్ అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగిందని, వారి నిధుల నుండి నియోజకవర్గ అభివృద్ధికి ఇదేవిధంగా నిధులు మంజూరు చేయాలని మరొకసారి కోరారు.

ఒక ముఖ్యంగా ప్రతి ఒక్కరూ అధికారులపై దురుసుగా ప్రవర్తన మానుకోవాలని కోరారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని,పరుష పదజాలంతో దూషించవద్దని అన్నారు.

అధికారులతో సమన్వయం చేస్తూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి కానీ వారిని ఇబ్బంది పెడుతూ, మీరు ఇబ్బంది పడకూడదని అన్నారు. హరితహారంలో భాగంగా హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా మనం చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి పై అధికారులతో కలిసి పనిచేస్తూ (గ్రీన్ ఛాలెంజ్) హరితహారం జిల్లాలోనే నెంబర్ వన్ గా ఉండేలా చూడాలని ప్రతి ఒక్కరిని కోరారు.

డబుల్ బెడ్రూం విషయంలో కేటీఆర్ మీటింగ్ సందర్భంగా ఎంపీ, కేటీఆర్ కి తెలియజేయడం జరిగిందని, దాని విషయంలో పూర్తి బాధ్యత ప్రభుత్వ పరంగా తీసుకొని పూర్తి చేస్తానని తెలియజేశారు. పట్టణం లోని జంగాల కాలనీ పరిశీలన కొరకు వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయని, వారికి తాత్కాలికంగా రోడ్డు మార్గం ఏర్పాటు చేశామని, హుజూర్ నగర్ మున్సిపాలిటీని నూతన మున్సిపాలిటీగా తీర్చిదిద్దే నిర్మాణంలో భాగంగా పార్టీలకతీతంగా పనిచేసి రాష్ట్రంలోనే మంచి మున్సిపాలిటీగా ఉండేలాగా చూడాలని ప్రతి ఒక్కరిని కోరారు.

Related posts

ఇన్ స్పిరేషన్ :యూట్యాబ్ ఛానెల్ చూసి నేరాలకు…

Satyam NEWS

లుక్స్ డిసివ్స్: బిడ్డ రూపంలో ఘరానా స్మగ్లింగ్

Satyam NEWS

నల్ల జీవోను తగలబెట్టిన తెలుగుదేశం

Bhavani

Leave a Comment