30.2 C
Hyderabad
May 17, 2024 16: 28 PM
Slider ప్రత్యేకం

అవినాష్ రెడ్డికి అసెంబ్లీ వేదికగా మీరు మద్దతు ఇవ్వవచ్చా?

#Avinash Reddy

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నిర్దోషి అని శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమర్ధించవచ్చు కానీ దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న రామోజీరావు మంచివారని తాము మద్దతు ఇవ్వకూడదా? అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. రామోజీరావు కు, మార్గదర్శి సంస్థ కు మద్దతుగా ఎవరైనా మాట్లాడితే, ఏ ఆధారాల ప్రకారం మద్దతుగా మాట్లాడుతున్నారో తెలియజేయాలని సిఐడి నోటీసులు జారీ చేస్తుందని సాక్షి దినపత్రిక ప్రచురించిన వార్త కథనంపై ఆయన ఫైర్ అయ్యారు. సాక్షి దినపత్రిక తమను బెదిరించాలని చూస్తుందా?, సిఐడి చీఫ్ సంజయ్ ఈ విషయాన్ని నిజంగానే సాక్షి దినపత్రికకు చెప్పారా? ఒకవేళ సిబిఐ చీఫ్ మాట్లాడాలి అనుకుంటే మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మాట్లాడాలి.

అప్పుడు మీడియా ప్రతినిధులు కూడా ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. రాజ్యాంగం ఎప్పుడైనా చదివారా?, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన వ్యక్తీకరణ అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులలో ఒకటన్నది వారు ఆయనకు గుర్తు చేస్తారన్నారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రామోజీరావు వంటి విలువలు కలిగిన వ్యక్తి ఎటువంటి తప్పు చేయరని భావించి, ఆయనకు మద్దతుగా మాట్లాడితే తప్పేముంది?. అయినా తన ప్రాథమిక హక్కును ప్రశ్నించే అధికారం సాక్షి దినపత్రికకు ఎక్కడిది?? అంటూ నిలదీశారు. సాక్షి దినపత్రిక రాసినట్టుగానే నోటీసులు ఇస్తామని సిఐడి పోలీసులు చెప్పారా ?, లేకపోతే, తనకు తానే ఊహించుకొని సాక్షి దినపత్రిక ఈ వార్తా కథనాన్ని ప్రచురించిందా??. సిఐడి అధికారి ఈ విషయాన్ని చెప్పకముందే, సాక్షి దినపత్రిక వార్తా కథనాన్ని ప్రచురిస్తే, ముందు సాక్షి దినపత్రిక యాజమాన్యానికే సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.


బెదిరిస్తే బెదిరి పోవాలా?సాక్షి దినపత్రిక, సిఐడి పోలీసులు బెదిరిస్తే, బెదిరిపోవాలా? అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. సిఐడి పోలీసుల వేధింపులను తాళలేక మార్గదర్శి సంస్థ ఆడిటర్ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని చార్టెడ్ అకౌంటెంట్లతోపాటు, న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకురాగా, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడైన ప్రొఫెసర్ శాస్త్రి అనే వ్యక్తి రామోజీరావును రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తున్న తీరును వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆర్థిక నేరాల కేసులలో జగన్మోహన్ రెడ్డి అభియోగాలను ఎదుర్కొంటున్నారు. అయినా తమ పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి నిర్దోషి అని పేర్కొనడం జరుగుతోంది. సిఐడి ప్రాతిపదిక ప్రకారం జగన్ నిర్దోషిని పేర్కొన్న వారందరికీ సిబిఐ నోటీసులు ఇవ్వాలి. సిబిఐ నేడు వారికి నోటీసులు జారీ చేస్తే, రేపు సిఐడి అధికారులు తమకు నోటీసులను జారీ చేస్తారేమో?.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న వైయస్ అవినాష్ రెడ్డికి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకున్న వాక్ స్వాతంత్రాన్ని వినియోగించుకొని మద్దతు ప్రకటించారు. వైయస్ అవినాష్ రెడ్డికి మద్దతు ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేస్తే, రామోజీరావుకు మద్దతు ప్రకటించిన తమకు సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేయవచ్చు. తమ ప్రాథమిక హక్కుల గురించి ప్రశ్నించే అధికారం సిఐడి కి లేదు. రామోజీరావు, మార్గదర్శి సంస్థ తప్పు చేసిందనే ఆధారాలు ఉంటే , సిఐడి పోలీసులు చార్జిషీటు దాఖలు చేసుకోవచ్చునని అన్నారు.

సాక్షి దినపత్రికకు, సిఐడి కి ఉన్న సంబంధం ఏమిటి?సాక్షి దినపత్రికకు, సిఐడి పోలీసులకు ఉన్న సంబంధం ఏమిటని?. సాక్షి దినపత్రిక రాష్ట్ర ప్రభుత్వ మౌత్ పీసా?, రాష్ట్ర ప్రభుత్వాన్ని సాక్షి దినపత్రికనే శాసిస్తోందా??, సాక్షి దినపత్రికలో ఏదైనా వార్త ప్రచురిస్తే, అది రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టేనా?? అంటూ రఘురామకృష్ణం రాజు శర పరంపరగా ప్రశ్నోస్త్రాలను సంధించారు. రామోజీరావును సిఐడి పోలీసులు విచారిస్తున్న ఫోటో, బయటికి ఎలా వచ్చిందన్న దానిపై ముందు సిఐడి పోలీసులు విచారణ చేపట్టాలి. సాక్షి దినపత్రిక యాజమాన్యాన్ని ప్రశ్నించాలి. రామోజీరావుకు మద్దతుగా మాట్లాడడాన్ని ప్రశ్నిస్తూ వివరాలు తెలియజేయాలని సిఐడి, సాక్షి దినపత్రిక ఉడత ఊపులకు బెదిరిపోయేవారు ఎవరూ లేరు. సిఐడి పోలీసులు తమ పరిధి ఏమిటో ముందు తెలుసుకుని, నడుచుకోవాలి.

సిఐడి పోలీసులు, ప్రజల కోసం న్యాయస్థానాలు ఉన్నాయన్న విషయాన్ని విస్మరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తమ ప్రాథమిక హక్కులను కాపాడుకోవడానికి అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. సాక్షి దినపత్రికలో చట్టానికి రామోజీరావు అతీతుడా?అనే శీర్షికతో అర పేజీ కథనం ప్రచురించింది . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో చేసిన చిట్ పండు చట్టాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసినవి కావని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. గత ప్రభుత్వాల హయాంలో చేసినవనే విషయము అందరికీ తెలిసిందే. అయినా చిట్ ఫండ్ చట్టాలను ఉల్లంఘించి ఎన్నో చిట్ ఫండ్ కంపెనీలు గత కొంతకాలంగా రాష్ట్రం లో మూతబడ్డాయి.

అటువంటి కంపెనీలపై రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నదో శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. రామోజీరావుకు వ్యతిరేకంగా తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని సిఐడి చెప్పినట్లుగా సాక్షి దినపత్రిక పేర్కొంది. అన్ని ఆధారాలు ఉన్నప్పుడు, ఆలస్యం ఎందుకు చేస్తున్నారు… తక్షణమే చార్జిషీట్ ను దాఖలు చేయవచ్చు కదా? అని ఆయన ఎద్దేవా చేశారు . మార్గదర్శి సంస్థ చిట్ ఎత్తుకున్న ఖాతాదారునికి మొత్తం సొమ్మును ఇవ్వకుండా తమ వద్దనే డిపాజిట్ చేసుకుంటుందని, ఆ డిపాజిట్ల మొత్తం వేల కోట్ల రూపాయలని సాక్షి దినపత్రికలో రాశారు. ఈ విషయాన్ని సిఐడి పోలీసులు సాక్షి దినపత్రికకు చెప్పారా?, లేకపోతే స్వయంగా సాక్షి దినపత్రిక పరిశోధన చేసి వార్త రాసిందా??. అటువంటి డిపాజిట్లు మొత్తము సొమ్ము కేవలం 50 నుంచి 60 కోట్ల రూపాయలు మాత్రమే. తనకు పూర్తి వివరాలన్నీ తెలుసు.

సాక్షి దినపత్రిక తన వద్దకు వస్తే, వారి వద్దనున్న ఆధారాలతో పాటు , తన దగ్గరున్న వివరాల గురించి చర్చిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ముపై పక్క రాష్ట్రం పెత్తనమా? అని సాక్షి దినపత్రిక ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసము, సాక్షి దినపత్రిక ప్రధాన కార్యాలయం కూడా పక్క రాష్ట్రంలోనే ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల సొమ్ముతో దొంగతనంగా నాలుగు లక్షల కాపీల సర్కులేషన్ పెంచుకున్న సాక్షి దినపత్రిక ప్రధాన కార్యాలయాన్ని ఏమైనా రాష్ట్రానికి మార్చారా? అంటూ ప్రశ్నించారు. రఘు రామకృష్ణంరాజు మాటలు జన వాఖ్యం. ప్రజలు తన దృష్టికి తీసుకు వస్తున్న విషయాలనే తాను మాట్లాడు న్నాను. ప్రజలు తనను వారి మౌత్ పీస్ గా వాడుకుంటున్నారు. ప్రజా గొంతుకగా తాను ప్రజా సమస్యలనే వినిపిస్తున్నానని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

Related posts

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత

Satyam NEWS

131 జీఓను రద్దు చేయాలని బిజెపి ఆందోళన

Satyam NEWS

సేవ్ ది లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Satyam NEWS

Leave a Comment